KGF 2 film editor stuns every one : ప్రపంచమంతా రాకీబాయ్ పెర్ఫార్మన్స్ కి ఆశ్చర్యబోతున్నారు. సినిమా చూసిన ప్రేక్షకుడికి సినిమాలోని యష్ స్టైలిష్ నటనా యాక్షన్ సీన్లు బాగా నచ్చాయి. ఇందులో నటించిన మిగిలిన నటులకు కూడా విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా ప్రధానమంత్రిగా నటించిన రవీనా టండన్ ఆ పాత్రలో ఒదిగిపోయారు.ఇక హీరో ఇంట్రడక్షన్ సీన్ యాక్షన్ సీన్స్ లో ఎలేవేషన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణ గా ఉన్నాయి.
ఇక సినిమా మొత్తం రాకీ భాయ్ హై ఎనర్జెటిక్ యాక్షన్ సన్నివేషాలతో గుర్రం లాగా సినిమా పరిగెడుతూ ఉంటుంది. ఇక సినిమా ఇప్పటికే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.ఇక బాహుబలి రికార్డులను కూడా బద్దలు కొడుతుంది అనే టాక్ వినిపిస్తోంది.ఇక సినిమాలో ప్రముఖంగా యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ పేర్లు బాగా వినిపించాయి. అయితే సినిమాలో ప్రాముఖ్యం ఉన్నా మరో వ్యక్తి ఎడిటర్ ఏ సీన్ ఏ యాంగిల్ లో చూపించాలో ఎడిటర్ కట్ లోనే ఉంది. అలాంటి ఎడిటర్ ఒక కేజీఎఫ్ లాంటి పెద్ద సినిమాకు ఆ బాధ్యత మరింత ఎక్కువ ఉంటుంది. ఒక యాక్షన్ సినిమాలో హీరోను ఎలా ఎలివేట్ చేయాలో ఎడిటర్ కు తెలిసుండాలి.అలాంటి కష్టతర బాధ్యతను ఒక 19ఏళ్ల కుర్రాడి చేతిలో పెట్టారు ప్రశాంత్ నీల్.
నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం. ఉజ్వల్ కులకర్ణి ఇపుడు ఈ పేరు అన్నిచోట్లా వినిపిస్తోంది. 19 ఏళ్ల ఉజ్వల్ కేజీఎఫ్ చాప్టర్ 2 ఎడిటర్ గా పనిచేసారు. అసలు ఈ అబ్బాయ్ ని నమ్మి ప్రశాంత్ అంత పెద్ద భాద్యతను ఎలా అప్పగించారనే అనుమానం వస్తుంది అది సహజమే.వయస్సుతో సంబంధం లేకుండా ఉజ్వల్ లోని హై లెవెల్ టెక్నికల్ టాలెంట్ చూసి అవకాశం ఇచ్చారని అని అర్థమవుతోంది .యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ ఎడిట్స్, ఫ్యాన్ మేడ్ వీడియో ఎడిట్స్ చూసి ఉజ్వల్ పనితీరు నచ్చి ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 అవకాశం ఇచ్చారట. మొదటి అవకాశంతోనే చాలా చిన్న వయసులో మంచి నేమ్ మరియు ఫేమ్ తెచ్చుకున్నాడు ఉజ్వల్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…