Allari Naresh: ప్రముఖ నిర్మాత ఈవివి సత్యనారాయణ వారసుడిగా అల్లరి సినిమా ద్వారా ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన నరేష్ మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకొని ఆ సినిమా పేరుని తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. ఆ తర్వాత దాదాపు 60 కి పైగా కామెడీ సినిమాలలో నటించి కామెడీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
దాదాపు కొన్ని సంవత్సరాల పాటు నరేష్ కి సరైన అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత నాంది సినిమాలో డిఫరెంట్ పాత్ర ద్వారా స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వైవిద్యమైన పాత్రలో నరేష్ హీరోగా నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం ఉగ్రం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రావడానికి నరేష్ సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా మే ఐదవ తేదీ ప్రేక్షకుల ముందుకి రానుంది. దీంతో ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లరి నరేష్ సినిమా విశేషాలతో పాటు మరొక ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. అల్లరి నరేష్ నటించిన సినిమాలలో సుడిగాడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.అయితే ఆ సినిమా సీక్వెల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయట పెట్టాడు.తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లరి నరేష్.. తన సినిమాల సీక్వెల్ గురించి మాట్లాడుతూ..
“తాను నటించిన సుడిగాడు సినిమా సీక్వెల్ చేస్తే బాగుంటుందని తెలిపాడు. అంతేకాకుండా ఆ సమయంలో ప్రస్తుతం దర్శకుడుగా మంచి గుర్తింపు పొందిన అనిల్ రావిపూడి ఆ సినిమా కోసం పని చేశాడని, ఆయనే స్వయంగా సుడిగాడు సీక్వెల్ తీద్దామా అని అడిగినట్లు నరేష్ చెప్పుకొచ్చాడు. నేను రూటు మార్చితే మళ్ళీ కామెడీ వైపు తీసుకెళ్తారా అని అడిగితే ఆయన ఓకే అన్నాడు అని నరేష్ తెలిపారు. అయితే నరేష్ మళ్లీ కామెడీ వైపు వెళ్లి అనిల్ రావిపూడి దర్శకత్వంలో నరేష్ సుడిగాడు 2 సినిమా చేస్తాడా? లేదా? అని అభిమానాలు వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…