Allari Naresh: సినిమా ఇండస్ట్రీలోకి ప్రముఖ డైరెక్టర్ కుమారుడిగా అల్లరి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటుడు అల్లరి నరేష్.డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ కుమారుడిగా ఈయన ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ తన టాలెంట్ తోనే అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలోకి వచ్చారు.ఒకానొక సమయంలో వరుస కామెడీ సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన నరేష్ ఈ మధ్యకాలంలో అడపా దడపా సినిమాలు చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన ఎన్నో విషయాల గురించి తెలియజేశారు ముఖ్యంగా తనకు ఇండస్ట్రీలో రాజమౌళి మణిరత్నం వంటి డైరెక్టర్లు అంటే ఇష్టమని నేను వారితో సినిమా చేయాలనుకున్న వారికి నాతో సినిమా చేసే టైం ఉండాలి కదా అంటూ వీరి గురించి ఓ సినిమాలో కూడా డైలాగ్ చెప్పారు. ఇలా ఈ ఇద్దరు దర్శకులు అంటే ఇష్టం అంటూ నరేష్ వెల్లడించారు.
ఇకపోతే వ్యక్తిగత విషయాల గురించి కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. తను కూడా ఒక సాధారణ వ్యక్తి లాగా జీవితం గడుపుతానని తరచూ పార్టీలకు వెళ్లడం ఎంజాయ్ చేయడం చేస్తుంటాను. ఇక అమ్మాయిలకు కూడా తను బాగా సైట్ కొడతానని ఈ సందర్భంగా నరేష్ తెలిపారు. ఇకతాను ఫ్లైట్ ఎక్కిన ప్రతిసారి తన పక్క సీట్లో అమ్మాయి ఉంటే బాగుండేదని అనుకుంటాను అయితే ఇప్పటివరకు ఒకసారి కూడా అలా జరగలేదని నరేష్ తెలిపారు.
ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన ఫస్ట్ క్రష్ గురించి కూడా నరేష్ బయట పెట్టారు. ఏడవ తరగతి చదువుతున్న సమయంలో తన క్లాసులో శ్వేత అనే అమ్మాయి ఉండేదని ఆ అమ్మాయి చూడ చక్కగా ఉండటమే కాకుండా క్లాస్ టాపర్ అంటూ నరేష్ శ్వేత అనే అమ్మాయి గురించి తెలిపారు. అయితే ఆ అమ్మాయి మలయాళీ అమ్మాయని తనే నా ఫస్ట్ క్రష్ అంటూ శ్వేత గురించి నరేష్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…