Allu Aravind: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అరవింద్ తాజాగా సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ సాయిధరమ్ తేజ్ గురించి పలు షాకింగ్ విషయాలను తెలియజేశారు.
సాయి ధరంతేజ్ గతంలో బైక్ ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. అప్పట్లో ఈయన తీవ్రమైన ప్రమాదం నుంచి బయట పడ్డారని చెప్పాలి.ఇలా ప్రమాదానికి గురైన సాయి ధరంతేజ్ దాదాపు నెల రోజులపాటు ఆసుపత్రిలో ఉంటూ చికిత్స తీసుకున్నారు. ఇక ఈయనకు వైద్యుల సర్జరీలు కూడా నిర్వహించిన విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ సాయి ధరంతేజ్ బైక్ ప్రమాదం గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు.సాయి ధరంతేజ్ ప్రమాదం విషయం తెలియగానే మొదట తానే ప్రమాద స్థలం వద్దకు వెళ్లానని అల్లు అరవింద్ తెలిపారు. అయితే ఆ క్షణం సాయిధరమ్ తేజ్ ను చూసి భయపడిపోయానని , ఒక చుక్క రక్తం కూడా రాలేదు అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి తనకు పావుగంట సమయం పట్టిందని అల్లు అరవింద్ తెలిపారు.
ఇలా ఎంతో పెద్ద ప్రమాదం నుంచి సాయి ధరంతేజ్ బ్రతికి బయటపడినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ఆ ప్రమాదం గురించి అల్లు అరవింద్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక విరూపాక్ష సినిమాలో ఆయన నటన చాలా అద్భుతంగా ఉంది అంటూ ఈ సందర్భంగా అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక సాయిధరమ్ తేజ్ కూడా ఈ ప్రమాదం గురించి గతం కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ అది ఒక పీడకలగా భావించలేదని స్వీట్ మెమరీగా దానిని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని సాయి ధరం తేజ చేసిన కామెంట్స్ మనకు తెలిసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…