Movie News

Hyper Aadi: ఆడవారి నైటీలను బ్యాన్ చేయాలి… ప్రభుత్వాలకు డిమాండ్ చేసిన ఆది… చివరికి ఏమైందంటే?

Hyper Aadi: హైపర్ ఆది పరిచయం అవసరం లేని పేరు బుల్లితెర కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆది ఒకప్పుడు జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేసేవారు. అయితే ప్రస్తుతం ఈయన శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంతో పాటు ఇతర బుల్లితెర కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా హైపర్ ఆది చేసిన స్కిట్ ఆద్యంతం అందరికీ నవ్వు తెప్పిస్తోంది.

ఈ ప్రోమోలో భాగంగా కమెడియన్స్ అందరూ కూడా పలు సినిమాలలోని సీన్లను స్పూఫ్ చేస్తూ సందడి చేశారు అయితే ఆది మాత్రం లక్ష్మీనరసింహ సినిమాలో బాలయ్య డైలాగ్ తో ఎంట్రీ ఇచ్చారు. వచ్చిన మొగోళ్ళు వచ్చినట్టే పోతుంటే ఈసారి వచ్చే మొగుడు బలయేవాడు కాదు బలిచ్చేవాడు వచ్చాడు రా హైపర్ ఆది అంటూ తొడ కొట్టారు.భర్త అంటే భరించేవాడు కాదు బరితెగించేవాడని ఈ రోజు నిరూపిస్తాను రావే అంటూ స్థితిలో తన భార్య పాత్రలో చేసిన అమ్మాయిని పిలుస్తారు.

ఇలా ఆది ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. అయితే అప్పటికే స్టేజిపై ఆడవాళ్ళందరూ కూడా మగవారిని చుట్టుముడతారు. అయినా ఆది తగ్గకుండాఇలా రౌండ్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి కన్ఫ్యూషన్ లో ఎవరి పెళ్ళాం అని కూడా చూడను అంటూ డైలాగ్స్ వేస్తారు.ఇంకా ఆది మాట్లాడుతూ సంక్రాంతి ఒక చీర కావాలని అడుగుతారు కానీ చీర మాత్రం కట్టరు ఆ ఒక్క నైటీ వేసుకుని ఆ నైటీ తోని పిల్లాడు ముక్కు చీదుతారు, కడుగుతారు ఆ నైటీ తోనే అన్నీ చేసి మళ్లీ మా పక్కకు వస్తారు అంటూ ఆడవారి గురించి మాట్లాడారు.

Hyper Aadi:ప్లాస్టిక్ ను కాదు నైటీలను బ్యాన్ చేయండి…

అంతటితో ఆగకుండా ప్రభుత్వాలకు చెబుతున్న బ్యాన్ చేయాల్సింది ప్లాస్టిక్ ను కాదు ఆడవారి నైటీలను బ్యాన్ చేయండి మీకు దండం పెడతా అంటూ వార్నింగ్ తో కూడిన రిక్వెస్ట్ చేశారు. ఇలా ఆడవారి నైటీల గురించి మాట్లాడుతున్న తగ్గేదే లేదంటూ రండే చూసుకుందామని ఆది రెచ్చిపోవడంతో ఆడవాళ్ళందరూ చుట్టూ చేరి ఆదిని చితకొట్టారు. ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago