Allu Aravind: ప్రముఖ కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం కాంతారా.కేజిఎఫ్ వంటి సినిమాని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోం భలే ఫిలిం నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం కాంతారా.కన్నడ చిత్ర పరిశ్రమలో తెరకెక్కిన ఈ సినిమా వివిధ భాషలలో డబ్ అయ్యి భారీ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైన ఈ సినిమా తెలుగులో అక్టోబర్ 15వ తేదీ విడుదల అయింది.
ఇక ఈ సినిమా తెలుగు రైట్స్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు.ఈ సినిమా తెలుగు రైట్స్ కేవలం అల్లు అరవింద్ రెండు కోట్ల రూపాయలకు కైవసం చేసుకున్నారని అయితే ఈ సినిమా విడుదలైన అనంతరం పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారని తెలుస్తోంది.
గత మూడు రోజుల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసినా కాంతారా సినిమా పేరు మారు మోగిపోతుంది.తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం లేనటువంటి ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని ఆదరణ సొంతం చేసుకున్నారు.
మొత్తానికి అల్లు అరవింద్ కన్నడ సినిమా తెలుగు హక్కులను కొనుగోలు చేసి భారీ లాభాలను పొందుతున్నారని తెలుస్తోంది.రెండు కోట్ల రూపాయలకు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేయగా మొదటి రోజే ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టిందని ఈ సినిమా ద్వారా అల్లు అరవింద్ ఏకంగా ఐదు రెట్ల లాభం పొందారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా తెలుగులో విడుదల చేయడంతో గాడ్ ఫాదర్ సినిమాపై కొంతమేర ప్రభావం చూపిందని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…