Movie News

Mohan Babu: ఆ విషయంలో మోహన్ బాబుకు కండిషన్ పెట్టిన మంచు విష్ణు… వైరల్ అవుతున్న మోహన్ బాబు కామెంట్స్!

Mohan Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా హీరోగా నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం ఇండస్ట్రీ కాస్త దూరమైనప్పటికీ అడపాదడపా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక ఈయన వారసులుగా విష్ణు మనోజ్ లక్ష్మీ ప్రసన్న ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఇక తాజాగా మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.ఈ సినిమా అక్టోబర్ 21వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను హైదరాబాదులో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ విష్ణు గురించి షాకింగ్ కామెంట్ చేశారు.

ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ ఇప్పటివరకు తాను ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణంరాజు, కృష్ణ వంటి ఎంతోమంది హీరోల వేడుకలలో పాల్గొన్నాను అలాగే అబ్దుల్ కలాం గారు మా విద్యాసంస్థలకు వచ్చినప్పుడు కూడా ఆయనతో నేను మాట్లాడాను.అయితే ఇలా ఎంతోమంది పెద్ద వాళ్లతో నేను మాట్లాడినప్పుడు కూడా నాకు ఇంత సమయం వరకే మాట్లాడాలని ఎవరు కండిషన్ పెట్టలేదు.

Mohan Babu: తక్కువ మాట్లాడమని చెప్పారు…

ఇకపోతే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో నేను ఇన్ని నిమిషాలు మాత్రమే మాట్లాడాలి అంటూ నా కొడుకు విష్ణు నాకు కండిషన్ పెట్టారు అంటూ ఈ సందర్భంగా మంచు మోహన్ బాబు విష్ణు గురించి షాకింగ్ కామెంట్ చేశారు. విష్ణు ఇలా చెప్పగానే ఒక్కసారిగా నాకు ఆశ్చర్యం వేసింది.అయినా అప్పటి రోజులకి ఇప్పటి రోజులకి చాలా తేడా ఉంది. కన్న బిడ్డలను కూడా పదిమందిలో పొగడకూడదు అంటారు అంటూ మోహన్ బాబు చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago