Actress Tulasi:ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి తులసి కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళం మలయాళం సినిమాలలో కూడా నటించి సందడి చేశారు. ఇన్నేళ్ల తన సినీ కెరియర్లో తులసి సుమారు 700 లకు పైగా సినిమాలలో నటించి సందడి చేశారు.
ఇలా ఐదు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి తులసి ఎంతోమంది యంగ్ హీరోలకు తల్లి పాత్రలలో కూడా నటిస్తూ ఇప్పటికే ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈమె నటించిన అనుకోని ప్రయాణం అనే సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి నటి తులసి సాయిబాబా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
డైరెక్టర్ శివమణితో తన పెళ్లి అనుకోకుండా ఒక రోజులోనే జరిగిపోయిందని ఈమె తెలిపారు.నిజానికి శివమణి కుటుంబం చాలా పేద కుటుంబమని నేను ఆ ఇంటి కోడలుగా అడుగుపెట్టిన తర్వాత అదృష్టం కలిసి వచ్చింది అని తెలిపారు. ఇక శివమణి హీరోగా చేసి భారీ ఎత్తున అప్పుల పాలు అయ్యామని, అదే సమయంలోనే మినుగు తార సినిమా కథను రాశానని తెలిపారు.
ఈ సినిమాని సొంతంగా నిర్మించి 13 కోట్ల రూపాయల వరకు లాభం పొందామని అయితే ఈ సినిమా హిట్ అయితే బాబా గుడిలోప్రభావలి చేయిస్తానని మొక్కుకున్నాం అయితే ఈ మొక్కు తీర్చకపోవడం వల్ల వచ్చినది మొత్తం వచ్చినట్టే వెళ్లిపోయిందని తెలిపారు.ఇక మొదట్లో తాను సాయిబాబాను ఏమాత్రం నమ్మేది కాదని అర్ధాంతరంగా నా తమ్ముడు చనిపోవడం వల్ల బాబాను బాగా తిట్టానని తెలిపారు.
ఇలా బాబాను కోపంగా తిట్టిన సమయంలో ఒకరోజు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో బాబా నా గదిలోకి వచ్చి అమ్మ అని పిలిచారు.గత ఏడు జన్మలుగా నువ్వేనా తల్లివి మరో ఆరు సంవత్సరాలలో నీ కడుపున పుడతాను అంటూ బాబా చెప్పి మాయమయ్యారని తులసి వెల్లడించారు.ఆ విధంగానే తమ్ముడు చనిపోయిన ఆరు సంవత్సరాలకు తనకు కొడుకు పుట్టారని బాబుకి సాయి అనే పేరు పెట్టుకున్నారని ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…