Allu Arha: అల్లు అర్హ పరిచయం అవసరం లేని పేరు అల్లు అర్జున్ వారసురాలుగా ఇండస్ట్రీకి చిన్న వయసులోనే బాలనటిగా పరిచయమైనటువంటి అల్లు అర్హ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.అల్లు అర్హ బుల్లి బుల్లి మాటలతో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఈమెకు సంబంధించిన అన్ని విషయాలను తన తల్లి స్నేహారెడ్డి షేర్ చేస్తూ ఉంటారు.
ఇలా ఇంత చిన్న వయసులోనే అల్లు అర్హకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈమె ఇప్పటికే శకుంతలం సినిమాలో బాలనటిగా నటించిన విషయం మనకు తెలిసిందే.అయితే ఇంత చిన్న వయసులో అల్లు అర్హ బడి పాఠాలను నేర్చుకోకుండా సినిమా పాటలనే ముందుగా నేర్చుకొని ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే ప్రస్తుతం ఈమె బడి పాఠాలను నేర్చుకోవడానికి స్కూల్ కి పయనమైనట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే అల్లు అర్హతన అన్నయ్య ఆయాన్ చేతిని పట్టుకొని స్కూల్ కి వెళ్తున్నటువంటి ఒక ఫోటోని అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అంటూ ఈ ఫోటోకి క్యాప్షన్ పెట్టారు. ఇందులో అల్లు అర్హ తన అన్నయ్య అయాన్ చేతిని పట్టుకొని వెనక్కి కూడా తిరిగి చూడకుండా లోపలికి వెళ్ళిపోతున్నారు. వీరిద్దరి స్కూల్ బ్యాగ్ పై అయాన్ అర్హ అనే పేర్లు కూడా ఉండడం విశేషం.
ఈ విధంగా అర్హ స్కూల్ కి వెళ్తున్నటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అల్లు అర్జున్ అభిమానులు ఈ ఫోటోని చూసి ఎంతో మురిసిపోతున్నారు.ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే అర్హ దేవర సినిమాలో కూడా కీలకపాత్రలో నటించబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…