Categories: FeaturedMovie News

Allu Arjun : అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం…ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) నిర్వహించిన భారీ పరేడ్‌కు నాయకత్వం..!

Allu Arjun : టాలీవుడ్ లో ఫ్యాషన్, స్టైల్ లకు మారు పేరు అంటే అల్లు అర్జున్ అని చెప్పవచ్చు. గంగోత్రి సినిమాతో మొదలు పెట్టి, పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక కేరళలో అల్లు అర్జున్ అక్కడి టాప్ హీరోలు అయిన మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి వారితో సమానంగా అభిమానులు ఉన్నారు. అక్కడ అల్లు అర్జున్ ని మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు. తాజాగా అల్లు అర్జున్ ని ఒక అరుదైన గౌరవం వరించింది.

పుష్ప డైలాగుతో అదరగొట్టిన బన్నీ…

ఇటీవల జరిగిన మన 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా న్యూయార్క్‌లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్(FIA) భారీ పరేడ్‌ ను నిర్వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఈ ర్యాలీని నిర్వహించగా అల్లు అర్జున్ గ్రాండ్ మార్షల్‌గా నాయకత్వం వహించారు. అల్లు అర్జున్ తో పాటు తన భార్య అల్లు స్నేహ కూడా పాల్గొన్నారు.

ఈక్రమంలో అల్లు అర్జున్ ర్యాలీ ని ఉద్దేశించి ఇలా మాట్లాడారు. ‘యే భారత్‌కా తిరంగా హై.. కబీ ఝుకేగా నహీ.. తగ్గేదేలే’ అంటూ అక్కడ ఉన్న వారందరినీ ఉత్సాహపరచడం తో పాటు భారతీయుడిగా జన్మించినందుకు గర్వపడుతున్నాను అని చెప్పారు. ర్యాలీ కి నాయకత్వం వహించినందుకు అక్కడి మేయర్ ఆమమ్స్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ రికగ్నిషన్‌ అల్లు అర్జున్ కు బహుకరించాడు. అల్లు అర్జున్ ర్యాలీ కి నాయకత్వం వహించడంతో న్యూయార్క్ నగర వీధులు అభిమానులతో కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago