Categories: FeaturedMovie News

Tarakarama Theater : అన్నగారు ఎంతో ఇష్టంగా కట్టించిన ఆ థియేటర్ బూతు సినిమాలు ఆడే థియేటర్ గా మారడానికి కారణం ఏమిటి…!

Tarakarama Theater : తెలుగు జాతికి కీర్తిని తెచ్చిన మహానటుడు అన్నగారు నందమూరి తారక రామరావు అటు సినిమాల్లోను, ఇటు రాజకీయాల్లోను చెరగని ముద్ర వేసిన మహా నాయకుడు. సినిమాల ద్వారా ఆయన సంపాదించిన ఆస్తులు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో కాచిగూడ లోని తారకరామ థియేటర్ ఒకటి. అన్నగారు ఎంతో ఇష్టంగా కట్టించుకున్న ఈ థియేటర్ లో బూతు సినిమాలు ప్రదర్శించాల్సిన దుస్థితి వచ్చింది. అసలు ఆ థియేటర్ కి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా…

ఎంతో ఇష్టంగా కట్టించుకున్న ఆ థియేటర్…

రామారావు గారు సినిమాల్లో ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో కాచిగూడ చౌరస్తా లోని ఒక స్థలాన్ని కొనుక్కొని అక్కడ థియేటర్ నిర్మించారు. అప్పట్లో ఆ థియేటర్ ఉన్న స్థలంలో కొంతమంది పిట్టలను వేటాడి జీవనం సాగిస్తుండేవారు. ఇక అలాంటి స్థలాన్ని వారిని నయానో భయానో ఒప్పించి ఒప్పుకొని వారికి డబ్బు ఇచ్చి అక్కడి నుండి ఖాళీ చేయించి స్థలాన్ని కొనుక్కున్నారు. ఇక అక్కడ థియేటర్ కట్టించాక తొలి సినిమాగా ‘అక్బర్ సలీం అనార్కలి’ సినిమాను విడుదల చేయాలని అనుకున్నా కట్టడం ఆలస్యం అవడంతో ఆ సినిమా మిగిలిన చోట్ల విడుదల అయి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక ఆ థియేటర్ లో అత్యధిక రోజులు ఆడిన సినిమా ‘డాన్’. అమితాబ్ బచ్చన్ నటించిన ‘డాన్’ సినిమా తారకారామ థియేటర్లో ఏకంగా 525 రోజులు ఆడి రికార్డు సృష్టించింది.

ఆ తరువాత ‘గీతాంజలి’ 225 రోజులు ఆడింది. కొన్ని సినిమాలు 100 రోజులు ఆడాయి. 1991 లో రాజీవ్ గాంధీ హత్య వల్ల ప్రతిపక్ష నాయకుల ఆస్తుల ధ్వంసంలో తారక రామ థియేటర్ దాడికి గురైంది. ఇక ఆ తరువాత థియేటర్ చాలా వరకు ధ్వంసం అవ్వడం వల్ల బి గ్రేడ్ బూతు సినిమాలు అక్కడ ప్రదర్శింప బడేవి. మలయాళం, ఇంగ్లీష్ బూతు సినిమాలను ప్రదర్శించేవారు. ఇక మల్టీ ప్లెక్సీ వచ్చాక ఏషియన్ సంస్థ వారు థియేటర్ ను మార్పు చేసి మల్టీ ప్లెక్సీ చేశారు. ఎంతో విశాలంగా థియేటర్ ను తయారు చేసిన థియేటర్ లో ఎక్కువ రోజులు ఆడిన సినిమా మాత్రం ‘ఉరి ది సర్జకల్ స్ట్రైక్స్’. ఈ సినిమా 75 రోజులు ఆడింది. అలా బి గ్రేడ్ సినిమా థియేటర్ గా ఆ తరువాత అద్దె కూడా వసూలు చేయలేని స్థితికి చేరింది. అలా అన్నగారు ఇష్టపడి కట్టించిన థియేటర్ కి పూర్వ వైభవం ఎప్పటికి వస్తుందో.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago