అప్పటి వరకు స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్.. పాన్ ఇండియా మూవీ పుష్ఫతో ‘ఐకాన్ స్టార్’ గా మారిపోయాడు. అల్లు అర్జున్ ఇక నుంచి ఐకాన్ స్టార్ అంటూ దర్శకుడు సుకుమార్ ఓ ఫంక్షన్ లో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పుష్ఫ సినిమా విడుదల కోసం ప్రతీ ఒక్కరూ ఎంతగానో ఎదురు చేస్తున్నారు.
మొదట ఒకే పార్ట్ గా విడుదల చేద్దామనకుకున్నా రెండు పార్ట్ లు తీయాల్సి వచ్చిందని దర్శకుడు సుకుమార్ అన్నారు. ఈ ఏడాది చివరకు మొదటి పార్ట్ ‘పుష్ప: ది రైజ్’ విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నారు. అందుకే షూటింగ్ త్వరగా పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇలా వృత్తి పరంగా ఎంతో బిజీ ఉన్న అర్జున్ వ్యక్తిగత జీవితానికి కూడా తగిన సమయాన్ని కేటాయిస్తున్నాడు.
తన కుటుంబంతో కలిసి ఈ మధ్య దుబాయ్ కు వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ పిక్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అధికారికంగా మాత్రం తెలియదు కానీ.. అతడు అక్కడే ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఎంతో యాక్టివ్ గా ఉంటాడన్న విషయం తెలిసిందే. అయితే పాన్ ఇండియా లెవల్లో తీస్తున్న ఈ పుష్ప సినిమాపై ప్రేక్షకులే కాకుండా సినీ ప్రముఖులు కూడా భారీగా అంచనా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప సినిమా హ్యట్రిక్ ది. ముందు ఆర్య, తర్వాత ఆర్యా2 తర్వాత మళ్లీ ఇలా ఈ సినిమా ద్వారా కలిశారు. అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి అయినా తనకు యూత్ ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టిన సినిమా ‘ఆర్య’ అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…
ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి మరోసారి తన మార్కెటింగ్ మైండ్‌తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రతి సినిమాకీ ముందుగానే ఖచ్చితమైన…
కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు ఒకరోజు ఒకలా మారుతూ కొనుగోలుదారులను అయోమయంలోకి నెట్టేస్తున్నాయి. భారీ పెరుగుదల తర్వాత ఒక్కసారిగా…
సినీ పరిశ్రమలో ఆన్‌స్క్రీన్ జంటలు నిజ జీవితంలో ఒక్కటవ్వడం అరుదు కాదు. ఇప్పుడు అలాంటి చర్చల మధ్య నిలిచిన జంటగా…