Amala Paul: తెలుగు తమిళ సినిమాలలో నటిగా పలు సినిమాలలో నటించి గుర్తింపు సంపాదించుకున్న అమలాపాల్ ప్రస్తుతం తెలుగు తెరకు దూరంగా ఉన్నప్పటికీ తమిళంలో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే ఈమె హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సినిమాలలో నటిస్తున్నారు.
ఇకపోతే గతంలో ఓ డైరెక్టర్ తో ప్రేమలో పడిన ఈమె అతనిని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.ఈ విధంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ వీరి వైవాహిక జీవితం ఏడాది పాటు కూడా సవ్యంగా సాగలేదని తెలుస్తుంది ఇలా విడాకులతో విడిపోయిన ఈ జంట ప్రస్తుతం ఎవరి కెరియర్లో వాళ్ళు బిజీగా ఉన్నారు.విడాకుల అనంతరం అమలాపాల్ కాస్త గ్లామర్ షో చేస్తూ బోల్డ్ సన్నివేశాలలో నటించడానికి కూడా సిద్ధపడ్డారు.
ఇకపోతే తాజాగా అమలాపాల్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈమె తమిళనాడులోని విల్లుపురం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి తనని తన మాజీ ప్రియుడు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని తన మాజీ ప్రియుడి పై నటి ఫిర్యాదు చేసింది. ఈమె ఫిర్యాదును అంగీకరించిన పోలీసులు ఈమె మాజీ ప్రియుడు పవీందర్ ను అదుపులోకి తీసుకున్నారు.
అమలాపాల్ గతంలో పవీందర్ తో కలిసి నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. ఇలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడటం ఆపరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ ప్రేమలో మునిగి తేలారు. అయితే ఈ నిర్మాణ సంస్థలో భాగంగా వాటాలలో తేడాలు రావడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి.. ఈ క్రమంలోనే అమలాపాల్ తన వాటా కావాలని డిమాండ్ చేయడంతో గతంలో వీరిద్దరూ కలిసి ఎంతో సన్నిహితంగా దిగిన ఫోటోలు వీడియోలను చూపించి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ తనపై లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఈమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు తన మాజీ ప్రియుడుని అదుపులోకి తీసుకున్నారు.తనతో పాటు మరో పదకొండు మందిపై ఫిర్యాదు చేయగా మిగిలిన వారి కోసం పోలీసులు గాలి చర్యలు చేపట్టారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…