Amalapaul: సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి అమలాపాల్ ఒకరు. ఈమె తమిళం మలయాళం సినిమాలతో పాటు తెలుగులో కూడా అల్లు అర్జున్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో కలిసి సినిమాలలో నటించారు. ఇలా పలు సినిమాలలో నటించినటువంటి ఈమె ఇటీవల రెండో వివాహం చేసుకొని తన వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.
ఈమె గతంలో తమిళ దర్శకుడిని వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకున్నటువంటి ఈమె జగత్ దేశాయ్ అనే వ్యక్తితో ప్రేమలో పడ్డారు ఈయనతో ప్రేమలో ఉన్నటువంటి అమలాపాల్ గత ఏడాది నవంబర్ నెలలో వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లయిన కొద్ది రోజులకే ఈమె ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తెలియజేశారు.
ఇలా తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తెలియజేసినప్పటి నుంచి ఈమె తరచు తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె సీమంతపు వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయని తెలుస్తుంది.
సాంప్రదాయ బద్ధంగా
తాజాగా అమలాపాల్ తన సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో భాగంగా ఈమె తన భర్తతో కలిసి వారి సంప్రదాయ ఆచారాల ప్రకారం ఈ వేడుకలను జరిపించారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈమెకు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…