Jordar Sujatha: ఘనంగా జబర్దస్త్ నటి సుజాత సీమంతపు వేడుకలు… రహస్యంగా ఉంచారే?

Jordar Sujatha: జోర్దార్ వార్తల ద్వారా తెలంగాణ యాసలో గలగల మాట్లాడుతూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి సుజాత అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లారు ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి జబర్దస్త్ కార్యక్రమంలో రాకింగ్ రాకేష్ టీమ్ లో కమెడియన్ గా చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు.

ఇలా జబర్దస్త్ కమెడియన్ గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ వచ్చారు. ఇటీవల వచ్చినటువంటి సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె గత ఏడాది రాకింగ్ రాకేష్ ను పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు..

ఇలా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఈమె త్వరలోనే తల్లి కూడా కాబోతున్నారని తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని ఈమె ఎక్కడా కూడా రివీల్ చేయలేదు చాలా రహస్యంగా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని మెయింటైన్ చేస్తూ వచ్చారు కానీ తాజాగా ఈమె సీమంతపు వేడుకలు జరగడంతో ఈ విషయం కాస్త బయటపడింది.

సీమంతపు వేడుకలు..
గెటప్ శ్రీను భార్య ఈ సీమంతపు వేడుకలకు హాజరై సుజాతతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హ్యాపీ ఫర్ యు కంగ్రాట్యులేషన్స్ అంటూ ఫోటోలను షేర్ చేయడంతో సుజాత తల్లి కాబోతుందనే విషయం బయటపడింది. ఏది ఏమైనా ఈ విషయాన్ని అందరితో పంచుకోకుండా సుజాత ఇలా రహస్యంగా ఉంచడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.