Amani: సీనియర్ నటి ఆమని ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఆమని పలు ఇంటర్వ్యూలలో హాజరవుతూ తన సినీ కెరియర్ గురించి ఎన్నో విషయాలను తెలియచేస్తున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆమని మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో ఎప్పటినుంచో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. అయితే అప్పట్లో సోషల్ మీడియా లేకపోవడంతో బయటకు వచ్చేది కాదు ఇలా ఎంతోమంది ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు నేను కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నానని అయితే తమిళ పరిశ్రమలో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఓ ప్రొడక్షన్ హౌస్ లో తాను సినిమా చేస్తుండగా స్విమ్మింగ్ పూల్ లో ఓ సన్నివేశం చేయాల్సి ఉంది.
ఈ సీన్ చేయడం కోసం ఒంటిపై ఏవైనా స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయో చూడాలి అంటూ తన బట్టలు విప్పమన్నారని ఈమె తెలియజేశారు అయితే దానికి నేను ఒప్పుకోలేదని కొందరు ఇలాంటి వాటి కోసమే ఇండస్ట్రీలో కొందరు ఉంటారంటూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అది పూర్తిగా హీరోయిన్ల నిర్ణయం పై ఆధారపడి ఉంటుందని తెలిపారు.అలాగే మరొక ఫైనాన్షియర్ తనకు కథ చెప్పాలి బీచ్ దగ్గరికి ఒంటరిగా రమ్మని కూడా పిలిచారు.
అప్పట్లో ఫోన్స్ ఉండేవి కాదు కథ విన్నాలన్న వారిని కలవాల్సిందే అయితే కథ వివరించేది దర్శక నిర్మాతలు లేదా డైరెక్టర్ కానీ ఫైనాన్షియర్ ఏం కథ వివరిస్తారు ఎందుకు తనని ఒంటరిగా రమ్మన్నారన్న సందేహం కలిగింది. అయితే తన తల్లి మాత్రం వెళ్లొద్దు అంటూ తనకి సలహా ఇచ్చిందనీ ఈ సందర్భంగా ఆమని క్యాస్టింగ్ కౌచ్ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…