Categories: FeaturedMovie News

Mirchi Madhavi : నాకు అలాంటి లైఫ్ వద్దు… యూకే నుండి అందుకే వచ్చేసా… సొంత కారు కూడా ప్రస్తుతం లేదు…: నటి మిర్చి మాధవి

Artist Mirchi Madhavi : తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ గుర్తింపుతో దూసుకుపోతున్న నటి ఊట్ల మాధవి. కానీ మిర్చి మాధవి గా సినిమాల్లో బాగా గుర్తింపు తెచ్చుకుంది. మొదట రేడియో జాకీగా తన కెరీర్ మొదలు పెట్టిన మాధవి ఆ తరువాత ఆర్టిస్ట్ గా సినిమాల్లో ప్రయాణాన్ని మొదలు పెట్టారు. చాలా సినిమాల్లో అత్త, వదిన, తల్లి పాత్రలతో మెప్పించిన మాధవి ఎన్టీఆర్ కథనాయకుడు, రామ చక్కని సీత, జోడి, శతమానం భవతి వంటి సినిమాల ద్వారా మంచి పేరు సంపాదించుకుంది. ఇక సినిమాలే కాకుండా సీరియల్ ఆర్టిస్ట్ గా ఉన్న మిర్చి మాధవి మా టీవిలో ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ లో నటించి దేవయాని పాత్రలో ప్రేక్షకులకు స్థిరపడిపోయారు.

అలాంటి జీవితం నేను భరించలేను…

తన సినిమా కెరీర్ గురించి మాట్లాడుతూ మిర్చి మాధవి గారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు. తెలుగు వాళ్లకు అవకాశాలు ఇస్తే బాగుంటుందని, అవసరమైతే పక్క రాష్ట్రాల వాళ్ళను పెట్టుకున్నా సరే కానీ అసలు తెలుగు వాళ్ళకే అవకాశాలు ఇవ్వకపోతే ఎలా అంటూ అభిప్రాయపడ్డారు. ఇక్కడున్న వారికి నిలబడటానికి కూడా అవకాశం లేకుండా బయటి వాళ్లను తెచ్చిపెట్టుకోవడం ఎందుకు అంటూ కామెంట్స్ చేసారు. ఇక తాను సినిమాలకు గ్యాప్ ఇవ్వడానికి కారణలాను వివరించారు. తన భర్త యూకె లో ఉద్యోగం చేస్తూ అక్కడికి వెళ్ళవలసి రావడం వల్ల సినిమాలకు గ్యాప్ ఇచ్చానని చెప్పారు. ఇక అందువల్లే సినిమాల్లో కనిపించడం లేదని మళ్ళీ ఇపుడు నటించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. గుప్పెడంత మనసు సీరియల్ ను వదులుకొని వెళ్లడం పెద్ద పొరపాటు అంటూ చాలా మంది ఇప్పటికీ దేవయాని పాత్రలో మళ్ళీ ఎపుడు కనిపిస్తారని అడుగుతుంటారు అంటూ చెప్పారు.

ఇక యూకె లో ఉండలేక పోయానని అక్కడ ఒంటరిగా ఉండటం నన్ను బాగా బాధించిందని, అలాంటి లైఫ్ లో నేను ఉండలేనని అనిపించింది అంటూ చెప్పారు. మనది కాని చోట ఉంటే ఊపిరి కూడా బరువెక్కుతుంది అంటూ ఎమోషనల్ అయ్యారు. అందుకే ఇప్పటికీ యూకె లో మేమున్న ప్లేస్ పేరు వింటేనే ఒకలాంటి భయం వస్తుందని ఇక అక్కడి నుండి వచ్చి మళ్ళీ నటనలో బిజీ అవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పారు. తాను ఏదీ ఎవరి నుండి ఆశించను దాని వల్ల హ్యాపీ గా ఉంటాను అంటూ చెప్పారు. ప్రస్తుతం తనకు కారు కూడా లేదని ఒకప్పుడు కారు మీద ఇష్టం ఉండేదని కానీ బయటికి తీసుకెళ్తే గీతలు ఎక్కడ పడుతాయో లాంటి టెన్షన్ కంటే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతే మన పని జరుగుతుంది, పార్కింగ్ సమస్య ఉండదని అనిపిస్తుంది. అందుకే సొంత కారు కూడా వద్దని ప్రశాంతగా ఉన్నాను అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago