సౌత్ సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్. గ్లామర్ బ్యూటీగా అద్భుత సినిమాలు చేసి.. చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. నాగచైతన్యతో విడాకుల తరువాత సమంతా తన కెరీర్ పై పూర్తీ ఫోకస్ పెట్టింది. అందుకోసం ఆమె దగ్గర వచ్చిన ఏ ఆఫర్ అయినా వదలడం లేదు. ఇటీవలే పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇప్పటికే సమంతా చేతిలో మరో 6 సినిమాలు ఉన్నాయి. అవే కాకుండా స్పెషల్ సాంగ్స్, కమర్షియల్ యాడ్స్ అంటూ అనేక రకాలుగా ప్రేక్షకులను కనువిందు చేస్తుంది.
అయితే తాజగా ఆమె చేసిన ఒక కమర్షియల్ యాడ్ అభిమానుల ఆగ్రహానికి గురిచేసింది. ఇదివరకు కూడా అనేక కమర్షియల్ యాడ్స్ లో సమంతా నటించింది. అయితే ఇప్పటివరకూ ఎప్పుడూ ఆల్కహాల్ కు సంబంధించిన యాడ్ ను ఆమె ప్రమోట్ చేయలేదు. తాజగా సోషల్ మీడియాలో ఓక ఆల్కహాల్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ కనిపించింది. అందులో ఆమె కొంచెం బోల్డ్ గా కనిపించడంతో ఆమెపై మండి పడుతున్నారు అక్కినేని అభిమానులు.
ఇది వరకు కూడా చాలా మంది హీరోయిన్స్ ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేసారు. వారందరూ కూడా ట్రోలింగ్ కు గురయ్యారు. అన్నీ తెలిసి కూడా సమంతా ఈ ప్రకటనలో ఎలా నటించింది అని ఆశ్చర్యపోతున్నారు మరికొందరు. మరికొందరు మాత్రం “డబ్బు కోసం మరీ ఇంతగా దిగజారాలా ? నువ్వు ఒక స్టార్ హీరోయిన్ అనే విషయం మర్చిపోయావా ?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమయినా సమంతకు ఇలాంటి విమర్శలు కొత్తేమీ కాడ్డు విడాకుల అనంతరం ఆమె అనేక విమర్శలకు ఎదుర్కొంది. అప్పటినుంచి వీటిని ఆమె పట్టించుకోవడం మానేసి తన పని తానూ చేసుకుంటూ పోతుంది.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…