Amardeep: బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో అమర్ దీప్ చౌదరి ఒకరు. ఈయన ఈ కార్యక్రమాల ద్వారా రన్నర్ గా నిలిచి బయటకు వచ్చారు. ఇక బిగ్ బాస్ పూర్తి అయినా అనంతరం ఈయన వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా కూడా బిజీ అయ్యారు.
బిగ్ బాస్ కార్యక్రమానికి రాకముందు బుల్లితెర నటుడిగా ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ ఉన్నటువంటి అమర్ ప్రస్తుతం వెళ్లి తెరపై హీరోగా సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక అమర్ మరొక బుల్లితెర నటి తేజస్విని గౌడ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరి జంట ఎంతో చూడముచ్చటగా ఉండటంతో వీరిని అనుసరించే వారి సంఖ్య కూడా అధికమైంది.
ఇకపోతే తాజాగా వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాలెంటైన్స్ డేను పురస్కరించుకొని స్టార్ మా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమర్ తేజ ఇద్దరు కూడా రొమాంటిక్ పర్ఫామెన్స్ చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు బుల్లితెర సెలబ్రిటీ కపుల్స్ హాజరై సందడి చేశారు.
తల్లిదండ్రులు కాబోతున్నారు..
ఈ క్రమంలోనే అమర్ తేజు గురించి శ్రీముఖి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి వీరిద్దరూ త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారని వీరిద్దరూ బేబీకి జన్మనివ్వబోతున్నారు అంటూ శ్రీముఖి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మరి నిజంగానే అమర్ తేజు తల్లిదండ్రులు కాబోతున్నారా లేకపోతే శ్రీముఖి సరదాగా మాట్లాడారా అన్న విషయం తెలియదు కానీ ఈ విషయం వైరల్ గా మారడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…