Sandeep Kishan: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సందీప్ కిషన్ ఒకరు. ఈయన హీరోగా వరుస సినిమాలలో నటిస్తే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇకపోతే ఇటీవల సందీప్ నటించిన సినిమాలు ఏవి పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇక చివరిగా సందీప్ కిషన్ మైకేల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమాకు నిర్మాతగా సందీప్ కిషన్ వ్యవహరించారు అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక త్వరలోనే సందీప్ కిషన్ ఊరి పేరు బైరవకోన అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. సందీప్ కిషన్ వర్ష హీరో హీరోయిన్లుగా నటించినటువంటి ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి సందీప్ కిషన్ తాజాగా మైకెల్ సినిమా గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మైకేల్ సినిమాకు తానే నిర్మాతగా వ్యవహరించానని తెలిపారు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను కానీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు అయితే ఈ సినిమా పోతుందని నాకు ముందే తెలుసు అంటూ ఈయన కామెంట్స్ చేశారు.
అవుట్ పుట్ నాకే నచ్చలేదు…
ఈ మూవీ రెవెన్యూ గురించి పక్కన పెడితే సినిమా ఫైనల్ అవుట్ పుట్ నాకే నచ్చలేదు. అదే విషయాన్ని డైరెక్టర్ కి కూడా చెప్పా. మా దగ్గర సాలిడ్ ఫుటేజ్ ఉంది. సో ఎడిటింగ్ విషయంలో ఏదైనా మ్యాజిక్ జరిగి ఉంటే మైఖేల్ ఫెంటాస్టిక్ ఫిలిం అయ్యేది. అక్కడే తేడా వచ్చింది. అందుకే ఈ సినిమా పోయిందని సందీప్ కిషన్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…