Balagam: బలగం సినిమా ద్వారా దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు జబర్దస్త్ కమెడియన్ వేణు. జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వేణు అనంతరం సినిమాలపై ఉన్నటువంటి ఇష్టంతో జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి సినిమాల ప్రయత్నాలు చేశారు.
ఇలా వేణుకు దిల్ రాజు అవకాశం ఇవ్వడంతో తన కుమార్తె నిర్మాణంలో వేణు బలగం సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకులు ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా చూపిస్తూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తెలంగాణలో మారుమూల గ్రామంలో కూడా ప్రత్యేకంగా స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఈ సినిమాని చూశారు అంతేకాకుండా చిన్నచిన్న మనస్పర్ధలు కారణంగా విడిపోయినటువంటి తోబుట్టువులు కూడా ఈ సినిమా చూసి కలిసారు అంటే ఈ సినిమా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తండ్రిని గుర్తు చేసుకున్న వేణు..
ఈ సినిమాకు ఎన్నో నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. ఇలా థియేటర్లలో ఒక చిన్న సినిమాగా విడుదలై అతిపెద్ద విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా వేణు మరోసారి ఈ సినిమా గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బలగం సినిమాని అందరూ చూశారు కానీ నువ్వు మాత్రం చూడలేదు నాన్న అంటూ తన తండ్రి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. వేణు తండ్రి గత పాతిక సంవత్సరాల క్రితమే మరణించారు. అయితే తన తండ్రి వర్ధంతిని పురస్కరించుకొని ఈయన తన తండ్రి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…