Amardeep Chowdary : బుల్లితెర మీద ఒక్కోమెట్టు ఎక్కుతూ నేడు పాపులర్ ఆర్టిస్ట్ అయిన అమర్ దీప్, ‘జానకి కలగనలేదు’ సీరియల్ ‘రామా’ అంటే బాగా తెలుస్తుంది. అంతలా సీరియల్ అభిమానులకు తన పాత్ర ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అమర్ దీప్ కెరీర్ ‘సిరి సిరి మువ్వ’ సీరియల్ ద్వారా మొదట సీరియల్స్ లోకి అడుగుపెట్టాడు. మొదటి సీరియల్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అమర్ దీప్ ఆ సీరియల్ కో స్టార్ మెరినా అబ్రహం గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
మెరినా చాలా కష్టపడే అమ్మాయి…
మెరినా అబ్రహం అమెరికా అమ్మాయి, సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది. ఆ తరువాత ఉయ్యాలా జంపాల, సిరి సిరి మువ్వ వంటి సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రేమించి సీరియల్స్ లోనే నటిస్తున్న రాహుల్ ను వివాహం చేసుకున్న మెరినా ఈ మధ్య సీరియల్ లో కనిపించడం లేదు. అయితే సిరి సిరి మువ్వ సీరియల్ లో అమర్ దీప్, మెరినా కలిసి నటించారు. ఇక తన కో స్టార్ మెరినా గురించి అమర్ దీప్ చెబుతూ తాను చాలా కష్టపడే అమ్మాయి అంటూ చెప్పాడు.
తాను షూటింగ్ కి వచ్చేకంటే ముందు తన ఇంట్లో వంట, మిగిలిన పనులు తానే చేసి, మల్లీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడ వంట పనులు చేసుకుని, ఆ తరువాత షూటింగ్ బయలుదేరుతుంది. వచ్చేటపుడు కారులో మేకప్ చేసుకుంటుంది, అంతలా తాను కష్టపడుతుంది. ఇక సాయంత్రం షూటింగ్ అయిపోయి వెళ్లే ముందు కూడా ఇంటికి వెళ్ళాక ఏం వంట వండాలి అని ఆలోచిస్తుంటుంది. తాను వంట చాలా అద్భుతంగా చేస్తుంది. సెట్స్ కి తాను చేసిన వంటలు తెస్తే ఎప్పుడైనా రుచి చూసే అవకాశం మాకు వస్తుంది అని చెప్పాడు అమర్ దీప్. ఇక మెరినా కూడా అమర్ దీప్ గురించి మాట్లాడుతూ చాలా కష్ట పడుతాడని, ఏదైనా అడిగితే నో చెప్పడని కో స్టార్స్ కి అంతే గౌరవం ఇస్తాడని చెప్పింది మెరినా.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…