Jordar Sujatha:తెలంగాణ యాసలో మాట్లాడుతూ తన భాషతో ఒక్కసారిగా ఎంతో పాపులారిటీ సంపాదించుకొని యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న జోర్దార్ సుజాత ప్రస్తుతం వరుస బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ అవకాశాన్ని అందుకోవడమే కాకుండా ఈ కార్యక్రమంతో బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.
ప్రస్తుతం ఈమె జబర్దస్త్ కార్యక్రమంలో రాకింగ్ రాకేష్ టీమ్ లో సందడి చేస్తున్నారు. ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమంలో లవ్ ట్రాక్స్ నిర్వహించడం సర్వసాధారణమే ఇలా లవ్ ట్రాక్ వల్ల ఎంతో మంది ఫేమస్ అవ్వగా వారిలో జోర్దార్ సుజాత రాకింగ్ రాకేష్ ఒకరు. అయితే వీరిద్దరూ కేవలం రీల్ లైఫ్ లోనే కాకుండా, రియల్ లైఫ్ లో కూడా ఒకటి కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే వాలంటైన్స్ డే సందర్భంగా రాకింగ్ రాకేష్ జబర్దస్త్ వేదికపైనే సుజాత చేతివేలికి రింగు తొడిగి తన ప్రేమను బయటపెట్టారు.వీరిద్దరి నిజంగానే ప్రేమలో ఉన్నారని వీరి పెళ్లికి కుటుంబ సభ్యులకు కూడా అంగీకరించారని తెలియడంతో వీరిద్దరూ ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు.అప్పటినుంచి రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాత కలిసి ఎన్నో వీడియోలు చేయడం హాలిడే వెకేషన్ వెళ్తూ పెద్ద ఎత్తున ఎంజాయ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా వరలక్ష్మీ వ్రతం కావడంతో పెద్ద ఎత్తున సెలబ్రిటీలు కూడా వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకున్నారు. ఈ క్రమంలోనే జోర్దార్ సుజాత పెళ్లి కాకుండానే రాకింగ్ రాకేష్ ఇంటికి వెళ్లి తనకు కాబోయే అత్తయ్యతో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకున్నట్లు ఆమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ పూజకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు. రాకేష్ కుటుంబం బ్రాహ్మిన్స్ కుటుంబం.వారింట్లో ఇలాంటి పూజలు ఎంతో ఘనంగా చేస్తారని తనకు ఈ పూజ ఎలా చేయాలో తెలియకపోవడంతో ఈ ఏడాది రాకేష్ మదర్ తనని వరలక్ష్మి వ్రతానికి ఆహ్వానించడంతో వారింట్లో పూజ చేస్తున్నానంటూ ఈమె ఈ వీడియోలో తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…
నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…