Amardeep &Tejaswini : అమర్‌దీప్, తేజస్విని ఇద్దరూ బుల్లితెర నటీనటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇద్దరూ కలసి ఒక్క సీరియల్ లో కూడా నటించలేదు. కానీ ఉన్నట్టుండి ఒకరోజు వీరి నిశ్చితార్త వేడుకకు సంబంధించిన ఫోటోలతో అందరినీ షాక్ కు గురించేశారు. అసలు వీరిద్దరికీ పరిచయం ఎలా ఏర్పడింది, ఇంత రహస్యంగా ఇలా ఎలా చేశారు అని ఒకింత ఆశ్చర్యానికి గురి చేసారు. ఇక రీసెంట్ గా పెళ్లి చేసుకున్న ఈ కొత్త జంట ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకున్నారు.
మమ్మల్ని విడదీయాలని చూసారు…
సోషల్ మీడియాలో అభిమానులతో లైవ్ చాట్స్ లో పాల్గొనడం వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం మామూలే. అలాంటి ఒక లైవ్ చాట్ లో అమర్ దీప్ తనను తేజస్వినిని విడదీయాలని చూసారని, మేమేమీ వారికి చెడు చేయలేదంటూ ఓపెన్ గా చెప్పడంతో ఒకింత చర్చకు దారితీసింది. ఇక అదే ప్రశ్న వారికి ఇంటర్వ్యూలో ఎదురుకాగా కొంతమందికి మనం కొంతమందితో కలిసుండటం జీవితంలో ఎదగడం ఇష్టముండదు.
నా లైఫ్ లో నేను తేజస్విని కలిసి ఉండటం ఇష్టం లేని కొంత మంది మమ్మల్ని విడదీయాలని చాలా అనుకున్నారు. అవి మొదట విన్నప్పుడు పట్టించుకోలేదు కానీ ఎక్కువయ్యాక అలా లైవ్ లో చెప్పాల్సి వచ్చింది అంటూ అమర్‌దీప్ చెప్పారు. ఇక తేజస్విని మాట్లాడుతూ మా వరకు ఇలాంటి విషయాలు వచ్చినా పెద్దగా నేను పట్టించుకోలేదు. అయితే అమర్ కొంచం ఎక్కువ ఆలోచిస్తాడు అందుకే తన స్టైల్ లో చెప్పాడు అంటూ చెప్పింది. వాళ్ళు చాలా హ్యాపీగా తమ లైఫ్ లో ఉన్నట్లు చెప్పిన ఇద్దరూ వాళ్ళ కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లు చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…