Categories: FeaturedMovie News

Amardeep -Tejaswini : కాబోయే భార్యకు అమర్‌దీప్‌ సర్ ప్రైస్… స్టేజి మీదనే కన్నీరు పెట్టుకున్న తేజస్విని, ఆమె తల్లి..!

Amardeep -Tejaswini : అమర్‌దీప్‌, తేజస్విని ఇద్దరూ బుల్లితెర నటీ నటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇద్దరూ కలసి ఒక్క సీరియల్ లో కూడా నటించలేదు. కానీ ఉన్నట్టుండి ఒకరోజు వీరి నిశ్చితార్త వేడుకకు సంబందించిన ఫోటోలతో అందరినీ షాక్ కు గురించేశారు. అసలు వీరిద్దరికీ పరిచయం ఎలా ఏర్పడింది, ఇంత రహస్యంగా ఇలా ఎలా చేశారు అని ఒకింత ఆశ్చర్యం కలిగినా అందరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేసారు. అయితే ఈ జంట ఒక టీవీ ప్రోగ్రాంలో కలసి సందడి చేశారు. దీనికి సంబందించిన ప్రోమో వైరల్ అవుతోంది.

కాబోయే భార్యకు జీవితంలో మర్చిపోలేని సర్ ప్రైస్…

వినాయక చవితి సందర్బంగా ఓ టీవీ ఛానల్ నిర్వహించిన ప్రోగ్రాంకు నిశ్చిత్తార్తం తర్వాత మొదటి సారి అమర్ దీప్ తేజస్వినిలు కలసి పాల్గొన్నారు. తేజస్విని తో పాటు వాళ్ళ అమ్మ గారు కూడా వచ్చారు. అయితే వీరి పరిచయం ప్రేమ ఇలాంటి ప్రశ్నలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు వీరి ఇద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది ఇక్కడి వరకు ఎలా వచ్చారు అని స్టేజి మీద పెర్ఫార్మ్ చేశారు. ఎంతో సరదాగా సాగుతున్న ప్రోమోలో అమర్ దీప్, తేజస్వినికి గిఫ్ట్ ఇవ్వడం కోసం తనకు, వాళ్ల అమ్మకు కళ్ళుమూశారు.

తరువాత ఎన్నో ఏళ్ళ క్రితం చనిపోయిన తేజస్విని వాళ్ళ నాన్న గారి మైనపు విగ్రహాన్ని స్టేజి మీదకు తీసుకు వచ్చి వీరి కళ్ళకు గంతులు తీసారు. తేజస్విని, వాళ్ళ అమ్మ తో పాటు స్టేజి మీద ఉన్న అందరూ ఎమోషనల్ అయ్యి కంటతదడి పెట్టుకున్మారు. తేజస్విని వాళ్ళ అమ్మ.. భర్త ప్రేమతో పాటు తండ్రి ప్రేమను పంచే వ్యక్తి నా కుమార్తెకి భర్తగా దొరికాడు, ఈరోజు అడి నువ్వు నిరూపించుకున్నావు.. లవ్‌ యూ నాన్న.. అంటూ ఎమోషనల్ కాగా దానికి అమర్‌దీప్‌ లవ్యూ అమ్మ అని చెప్పాడు. ప్రస్తుతం ఈ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ప్రోగ్రాం వినాయకచవితి రోజున ప్రసారం కాబోతోంది.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago