Featured

Jay shah : జాతీయ జెండా తీసుకోడానికి నిరాకరించిన కేంద్ర మంత్రి కొడుకు… ఘోరంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..!

Jay shah : సోషల్ మీడియా జమానాలో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో ఒకచోట తప్పు చేసి దొరికిపోతుంటారు సెలబ్రిటీలు. ఒకసారి నెటిజన్స్ చేతికి చిక్కారా ఇక ట్రోల్ల్స్ తో ఆడుకుంటారు. దీనికి సినిమా వాళ్ళైనా, రాజకీయ నాయకులైనా ఎవరైనా మినహాయింపు లేదు. ఒక్క మంచి పనితో ఓవర్ నైట్ స్టార్ ఎలా అవుతారో సోషల్ మీడియాలో అలాగే ఒక చిన్న తప్పు వల్ల అంత నెగెటివిటీ ఎదుర్కొంటారు. అందుకే ఈ సోషల్ మీడియా దునియాలో జర జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇపుడు సోషల్ మీడియాలో ట్రోల్ ఎదురకొంటున్నాడు ఒక కేంద్ర మంత్రి కొడుకు. నిజానికి వివాదాస్పద వాఖ్యలు చేసి ఏ పబ్బుల్లోనో దొరికి ట్రోల్ల్స్ కి గురవడం లేదు. కేవలం అతను చేసిన చిన్న సైగ వల్ల నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్ కి బలయ్యాడు.

అమిత్ షా కొడుకు జాతీయ జెండా తీసుకోడానికి నిరాకరణ…

ఆసియా కప్ 2022 గేమ్స్ లో భాగంగా నిన్న దాయాదుల మధ్య పోరు హోరాహోరిగా జరిగింది. ఇండియా పాకిస్థాన్ మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరిగింది. ఇందులో ప్రత్యర్థి పాకిస్థాన్ మీద ఐదు వికెట్ల తేడాతో ఇండియా గెలిచింది. అయితే ఈ మ్యాచ్ చూడటానికి సాధారణ జనం నుండి సెలబ్రిటీల వరకు ఆందరూ ఆసక్తిగా దుబాయ్ వెళ్లారు. ఇక హీరో విజయ్ దేవరకొండ, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తనయుడు జై షా కూడా ఉన్నారు. మ్యాచ్ గెలిచాక అందరూ భారత జెండ చూపుతూ అనందాన్ని వ్యక్తం చేసారు. ఈలలు గోల చేస్తూ సంతోషాన్ని సెలెబ్రేట్ చేసుకున్నారు.

అదే సమయంలో ఒక వ్యక్తి జై షా కు జెండా ఇవ్వబోతుంటే జై షా వద్దు అన్నట్లు నిరాకరించాడు. ఇక ఈ సంఘటనకు సంబంధిచిన వీడియో నెట్టింట్లో ప్రత్యేక్షమైంది. ఇక అంతే జండా తీసుకోడానికి అంత బలుపా అంటూ నెగెటివ్ కామెంట్స్ తో హోరేత్తిస్తున్నారు నెటిజన్స్. ఇక మరో వైపు బీజేపీ ప్రభుత్వం ఇటీవలే ‘హర్ ఘర్ తిరంగా’ అంటూ స్వాత్రంత్ర వేడుకల్లో భాగంగా ప్రతి ఇంటి ముందు భారతీయులు జెండా ఎగురవేసి దేశభక్తి చాటుకొమ్మని ప్రచారం చేస్తే ప్రతి పౌరుడు జెండా ఎగురవేశాడు. కేంద్ర మంత్రి కుమారుడివైన నువ్వు.. జెండా పట్టుకోవడానికి నిరాకరించావు, ఇదేనా నీ దేశభక్తి, సంస్కారం అంటూ ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేస్తూ ఆడుకుంటున్నారు నెటిజన్స్ .

Bhargavi

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

14 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

15 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

22 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

23 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

23 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago