Featured

Hrithik Roshan : అభిమాని కాళ్లు మొక్కిన హృతిక్… అందుకే అయన సూపర్ స్టార్ అంటూ కామెంట్లు… వైరల్ అవుతున్న వీడియో..!

Hrithik Roshan : బాలీవుడ్ దర్శకుడు రాకేష్ రోషన్ కుమారుడు గా హృతిక్ సినిమా రంగ ప్రవేశం చేసాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలలో నటించినప్పటికీ 2000 సంవత్సరంలో వచ్చిన ‘కహోనా ప్యార్ హై’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. తరువాత వరుసగా ఫిజా, మిషన్ కాశ్మీర్, కబీ ఖుషి కబి గం వంటి సినిమాలు విజయాలు అందించాయి. తరువాత ఆశించిన విజయాలు రాలేదు. ఆ తరువాత కోయి మిల్ గయా, ధూమ్ 2, జోదా అక్బర్, క్రిష్ వంటి సినిమాలు ఆయనను సూపర్ స్టార్ ను చేసాయి. ఇపుడు తాజాగా హృతిక్ కు సంబందించిన ఒక విషయం వైరల్ అవుతోంది.

అభిమాని కాళ్ళు మొక్కగా వెంటనే స్పందించిన హృతిక్…

గర్వానికి హృతిక్ చాలా దూరం అని మరోసారి నిరూపించుకున్నాడు. తాజాగా ఒక ఫిట్నెస్ ప్రోగ్రాముకు హృతిక్ హాజరు కాగా ఆయనను చూడటానికి పెద్ద ఎత్తున అభిమానులు కూడా వచ్చారు. అయితే ఒక అభిమాని హృతిక్ దగ్గరకు వచ్చి వెంటనే ఆయన కాళ్లు మొక్కాడు. అయితే వెంటనే హృతిక్ స్పందించి తిరిగి అభిమాని కాళ్లకు దండం పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్లో వైరల్ అవుతోంది.

దీన్ని చూసిన నెటిజన్లు హృతిక్ చేసిన పనిపై స్పందిస్తున్నారు. కొంత మంది అది హృతిక్‌ రోషన్‌ మంచితనం అంటే అని కామెంట్ చేస్తుంటే ఇంకొంతమంది..‘‘హృతిక్‌ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం కలవాడు, అందుకే అభిమానులు ఆయన్ని సూపర్‌ స్టార్‌ అంటారు’’ అంటూ కామెంట్లు చేస్తూ అభిమానాన్ని తెలియజేస్తున్నారు. ఇక ప్రస్తుతం తమిళ సినిమా ‘విక్రమ్ వేద’ సినిమాకు రీమేక్ హృతిక్ రోషన్ తీస్తున్న సినిమా సెప్టెంబర్ 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Bhargavi

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

11 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

12 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

19 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

20 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

20 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago