Thammareddy Bhardwaja : ‘తెలుగు భాషా దినోత్సవం’ సందర్బంగా తమ్మారెడ్డి భరద్వాజ గారు ప్రస్తుత తెలుగు సినిమా పోకడల గురించి విమర్శించారు. ప్రస్తుతం వస్తున్న సినిమాలు వాటిలో ఉపయోగిస్తున్న భాష, ఇక పాటల్లో పదాల ఉచ్చరణ వంటివి తెలుగు భాషను నాశనం చేస్తున్నాయి అంటూ విమర్శించారు. ఇక హీరోలకే సరిగా తెలుగు రాదు ఇక మిగిలిన ఆర్టిస్ట్ల సంగతి చెప్పక్కర్లేదు. మన తెలుగు సినిమాల్లో మన వాళ్ళ కంటే పక్క భాషల వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇక వారికీ భాష రాదు, పోనీ వాళ్లకు డబ్బింగ్ చెప్పే వాళ్లకన్నా భాష వస్తుందా అంటే అదీ లేదు. ఇక తెలుగుకి తెగులు పట్టిస్తారు ఇలాంటి వాళ్ళు అంటూ ఆయన వ్యంగ్యంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.
చిరు, బాలయ్య ను చూసి నేర్చుకోండి… ఎన్టీఆర్ తప్ప ఇప్పటి హీరోలకు తెలుగు రాదు…
ప్రస్తుతం ఉన్న హీరోల్లో చాలా మందికి తెలుగు మాట్లాడటం స్పష్టంగా రాదు. ఇక రాయడం అసలు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడున్న హీరోల్లో ఎన్టీఆర్ మాత్రమే తెలుగు చక్కగా మాట్లాడుతాడు మిగిలిన వాళ్లకు తెలుగు సరిగా మాట్లాడటమే రాదు. ఇక వారికి డైలాగులు తెలుగులో చెప్పడం ఇంకేం సరిగా వస్తుంది. పోనీ దర్శకులు తప్పులను సరి చేస్తారా అంటే వాళ్ళ పరిస్థితీ అంతే, చాలా మంది కుర్ర దర్శకులకు తెలుగు భాష పై పట్టు ఉండటం లేదు. ఈ మధ్య వచ్చిన ‘లైగర్’ సినిమాలో ‘వాట్ లాగా దేంగే’ అంటూ ఆ డైలాగులు ఏమిటి.. రాసినవాడికైనా బుద్ధుండాలి కదా. పాన్ ఇండియా మోజులో పడి భాష ను కిచిడి చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు భరద్వాజ గారు.
పాన్ ఇండియా సినిమా అంటూ పర భాష నటులను పెట్టుకోవడం ఒకటైతే ఇక దాంట్లో భాషను నాశనం చేస్తున్నారు. అన్ని భాషల్లో విడుదల చేయాలంటే దానికి తెలుగును చంపడం ఎందుకు ఏ భాషలో విడుదల చేస్తున్నారో అక్కడ ఆ భాష వాడితే సరిపోతుంది. అన్ని భాషలు తెలుగులో వాడాలా, అయినా పాన్ ఇండియా సినిమాను ఇప్పుడేదో కొత్తగా కనుగొన్నట్టు చేస్తున్నారు. ఎపుడో భానుమతి గారు మూడు భాషలలో ‘చండి రాని’ అనే సినిమాను ఏ భాషకు సంబంధిచిన నటులతో అక్కడ షూటింగ్ చేసి కేవలం 35 రోజుల్లో సినిమా తీశారు, మూడు భాషల్లోనూ అది పాన్ ఇండియా చిత్రమే. ఇపుడు పాన్ ఇండియా పేరుతో అన్ని భాషలనూ కిచిడి చేసి ఆ సినిమాను సంవత్సరాలు తీస్తారు, ఏదో గొప్ప విషయం అన్నట్టు చెబుతారు అంటూ మండిపడ్డారు. చిరంజీవి, బాలకృష్ణ ను ఈ తరం నటులు ఆదర్శంగా తీసుకుంటే కొన ఊపిరి తో ఉన్న తెలుగు భాష కనీసం బ్రతుకుతుంది అంటూ అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…