Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని వారసుడిగా ఎనిమిది నెలల వయసులోనే వెలుగునీడలు అనే సినిమాలో కెమెరా ముందుకు వచ్చారు. నాగేశ్వరరావు నటించిన ఈ సినిమాలో నాగార్జున బాల నటుడిగా నటించారు. అనంతరం సుడిగుండాలు అనే సినిమాలో కూడా ఈయన బాలనటుడిగా నటించి సందడి చేశారు.
ఈ విధంగా ఇండస్ట్రీలో బాలనటుడిగా మెప్పించిన ఈయన అనంతరం హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో వైవిధ్య భరితమైన పాత్రలలో నటించి మెప్పించారు. అన్ని జానర్లలో సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోలలో నాగార్జున ఒకరు.ఇకపోతే ఈయన హీరోగా మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలలో అతిథి పాత్రలో నటించారు అయితే ఈయన అతిథి పాత్రలో నటించిన సినిమాలు కూడా మంచి హిట్ కావడం విశేషం.
నాగార్జున త్రిమూర్తులు, రావుగారిల్లు, ఘటోత్కచుడు, నిన్నే ప్రేమిస్తా, స్టైల్, తకిట తకిట, దొంగాట, అధిపతి, అఖిల్, సైజ్ జీరో, ప్రేమమ్ సినిమాలలో గెస్ట్ రోల్స్ లో మెప్పించారు.ఇలా ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలలో నటించడమే కాకుండా పలు సినిమాలలో అతిథి పాత్రలో నటించి మంచి విజయాలను సొంతం చేసుకున్న క్రెడిట్ నాగార్జునకి దక్కిందని చెప్పాలి. ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున తన కెరీర్ గురించి కూడా పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.
తాను స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఈ స్థానంలో ఉన్నానంటే అందుకు గల కారణం తన డైరెక్టర్లేనని ఈ సందర్భంగా నాగార్జున తెలిపారు.డైరెక్టర్లు ఎంతో విభిన్నమైన కథలను సిద్ధం చేసి తన పాత్రలను భిన్నంగా చూపించడం వల్లే తాను మంచి విజయాలను అందుకొని ఈ స్థాయిలో ఉన్నానని నాగార్జున ఈ సందర్భంగా వెల్లడించారు. ఇలా నాగార్జున చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈయన ప్రస్తుతం ది ఘోస్ట్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఇలా ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…