Amardeep -Tejaswini: బుల్లితెర నటీనటులుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అమర్ దీప్, తేజస్విని గౌడ వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి పెద్ద ఎత్తున బుల్లితెర నటీనటులు హాజరయ్యి సందడి చేశారు. ఈ క్రమంలోనే వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
బుల్లితెరపై జానకి కలగనలేదు సీరియల్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి అమర్ తోటి నటి తేజస్విని గౌడను రహస్యంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. రెండు నెలల క్రితం వీరి నిశ్చితార్థం బెంగుళూరులో ఎంతో ఘనంగా జరిగింది.ఇలా నిశ్చితార్థ ఫోటోలు వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. అసలు వీరిద్దరూ ప్రేమలో ఎప్పుడు పడ్డారని సందేహాలు కూడా వ్యక్తం చేశారు.
ఇలా నిశ్చితార్థం అనంతరం పెళ్లి పనులలో బిజీ అవుతూ ఎన్నో వీడియోలను తేజస్విని కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇకపోతే డిసెంబర్ 14వ తేదీ ఈ జంట పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో ఎంతోమంది అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ విధంగా వీరి ఫోటోలు పై పలువురు కామెంట్లు చేస్తూ చూడముచ్చని జంట అంటూ కామెంట్లు చేయగా ఈ జంటకు ఎవరి దిష్టి తగలకూడదు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక వీరి వివాహంలో జానకి కలగనలేదు సీరియల్ టీం తో పాటు ఇతర బుల్లితెర నటీమణులు పెద్ద ఎత్తున సందడి చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా అమర్ తేజస్విని పెళ్లి ఫోటోలపై ఓ లుక్ వేయండి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…