Movie News

Ambanti Rambabu: పవన్ నాలుగో పెళ్లికి పోలవరం ప్రాజెక్టు ముడిపెట్టి అడ్డంగా బుక్ అయిన అంబటి రాంబాబు !

Ambanti Rambabu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు కూడా హాట్ హాట్ గా ఉంటాయి. ఏదో ఒక విషయం గురించి అధికార ప్రతిపక్ష నేతల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది.ఈ క్రమంలోనే వైసీపీ నేతలు జనసేన నేత పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ తరచూ ఆయన మూడు పెళ్లిళ్ల ప్రస్తావన తీసుకువస్తూ తనపై కామెంట్లు చేసేవారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన మూడు పెళ్లిళ్లు గురించి తరచూ ప్రస్తావనకు తీసుకురావడంతో తనదైన స్టైల్ లో చెప్పు చూపిస్తూ వైసిపి నేతలకు ఘాటుగా సమాధానం చెప్పారు.

ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పాలంటూ అబంటికి ప్రశ్న వేశారు.ఈ క్రమంలోనే అంబటి రాంబాబు ఈ విషయం గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లికి పోలవరం ప్రాజెక్టుకి ముడి పెట్టి సమాధానం చెప్పారు.

పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి చేసుకుని లోపు పోలవరం పూర్తవుతుంది అంటూ ఈయన చేసిన కామెంట్స్ తీవ్రదుమారం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం అది తన వ్యక్తిగతం. అయితే మంత్రి అంబంటి రాంబాబు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లను జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరంకు ముడి పెట్టడంతో పెద్ద ఎత్తున నేటిజన్స్ తమదైన శైలిలో అంబటిపై కామెంట్లు చేస్తున్నారు.

Ambanti Rambabu: సమాధానం చెప్పడం చేతకాకపోతే సైలెంట్ అవ్వాలి…

ఈ విధంగా జాతీయ ప్రాజెక్టును పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లతో ముడిపెట్టి సమాధానం చెప్పడంతో పలువురు ఈ విషయంపై స్పందిస్తూ సమాధానం చెప్పడం చేత కాకపోతే సైలెంట్ గా ఉండాలి కానీ పవన్ కళ్యాణ్ పెళ్లికి పోలవరానికి ముడి పెట్టడం ఏంటి? నేను వేసిన సెటైరు.. నాకు చెప్పు చూపించిన జనసేనా కార్యకర్తలకు మాత్రమే..’ అంటున్నారు అంబటి. చెప్పు చూపించడం సంగతి పక్కన పెడితే, ప్రశ్న అడిగినప్పుడు సంబంధిత శాఖ మంత్రి అయ్యుండుకొని సరైన సమాధానం చెప్పాల్సింది పోయి పవన్ కళ్యాణ్ పెళ్లికి ముడి పెట్టడంతో పెద్ద ఎత్తున ఈయనపై మండిపడుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పసుపు అరటి కాదు… ఎర్ర అరటి తింటేనే అసలు హెల్త్ సీక్రెట్!

మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…

6 hours ago

విశాఖలో విషాదం.. యువతి ఆత్మహత్య కేసులో ఆరుగురు అరెస్ట్

విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…

7 hours ago

ఫోన్‌తో టాయిలెట్‌లో గడిపితే… మీ శరీరం చెల్లించాల్సిన ధర ఇదే!

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…

7 hours ago

టాలీవుడ్‌కు ఘట్టమనేని వారసుడి ఎంట్రీ.. హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ హాట్ టాపిక్

తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…

7 hours ago

కేరళ సీఎంకు లేఖ.. మోనాలిసా కేసులో కొత్త ట్విస్ట్

‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…

7 hours ago

పచ్చదనం మంచిదే కానీ.. ఈ చెట్లకు దూరంగా ఉండండి!

ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…

7 hours ago