Dil Raju: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.డిస్ట్రిబ్యూటర్ గా తన కెరియర్ ప్రారంభించిన దిల్ రాజు అనంతరం చిన్న సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా మారారు. ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తూ బడా ప్రొడ్యూసర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇక సినిమా పనుల నుంచి దిల్ రాజుకు ఏమాత్రం విరామం దొరికిన తన కుటుంబంతో కలిసి సమయం గడపడానికి కేటాయిస్తారు.ఈ క్రమంలోనే తన భార్య తేజస్వినితో కలిసి పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలను నిర్వహించిన దిల్ రాజు దంపతులు తాజాగా ముంబైలో జరిగిన దీపావళి బాష్ పార్టీలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దిల్ రాజు తన మొదటి భార్య అనిత గుండెపోటుతో మరణించిన అనంతరం తన కూతురు స్వయంగా తన తండ్రికి తేజస్విని అనే అమ్మాయితో రెండవ వివాహం చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక తేజస్విని కూడా గత కొన్ని నెలల క్రితం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.ఇలా దిల్ రాజు ఇంటికి వారసుడు రావడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఇకపోతే దిల్ రాజు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వారసుడు అనే సినిమాని చేస్తున్నారు. అదేవిధంగా రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో మరో పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్నాయి. ఇకపోతే ప్రస్తుతం దిల్ రాజు దంపతులకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…