Featured

Ameer khan : లాల్ సింగ్ చద్దా తో అమీర్ ఖాన్ కి వచ్చిన నష్టం డబ్బు కాదు… మరి జరిగిన నష్టం ఏంటో తెలుసా…!

Ameer Khan : అమీర్ ఖాన్ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్. తన సినిమాలు జనాలకు నచ్చడం కాదు అంతకుమించి రికార్డు స్థాయి వసూళ్లను అందుకుంటూ టాప్ ఇండియన్ సినిమాల్లో నిలిచాయి. ఇదంతా గతం అనాలేమో ఎందుకంటే అమీర్ ఖాన్ తీసిన ‘థగ్ ఆఫ్ హిందూస్తాన్’ ఇపుడు ‘లాల్ సింగ్ చద్దా’ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాకోట్టాయి. అయితే ప్రస్తుతం వచ్చిన లాల్ సింగ్ చద్దా సినిమా విషయంలో దారుణంగా పరిస్థితి మారింది. వసూళ్లను రాబట్టడం పక్కన పెడితే సినిమాను బాయ్ కాట్ చేయాలనే ట్రెండ్ తో అమీర్ ఇమేజ్ బాగా డామేజ్ అయింది. కానీ వసూళ్ల పరంగా సినిమాకు నష్టాలు అమీర్ కు పెద్దవి కాదు కానీ అసలు జరిగిన నష్టం వేరని ఇండస్ట్రీ టాక్.

అమీర్ ఫ్యూచర్ సినిమాలపై ప్రభావం…

లాల్ సింగ్ చద్దా సినిమాకు ముఖ్యంగా అమీర్ ఖాన్ అంతకు ముందు 2015 సమయంలో ఇండియాలో బ్రతకడానికి నాకు, నా భార్యకు భయమేస్తోంది ఇక్కడ రక్షణ లేదు అంటూ వాఖ్యనించాడు. అప్పటి వాఖ్యల ఫలితం ఇప్పుడు జరిగింది. అమీర్ ఖాన్ కి బాలీవుడ్ ఇప్ప్పటికే అక్కడి హీరోల మీద సుశాంత్ మరణం వల్ల మొదలైన వ్యతిరేకత మరింత పుంజుకుంది. ట్విట్టర్ లో అమీర్ వాఖ్యలను బాగా ట్రెండ్ చేసి బాయ్ కాట్ చేసారు సినిమాను. ఈ ప్రభావం సినిమా మీద బాగానే పడింది. ఇక సినిమా వసూళ్ల పరంగా నిరాశ పరిచినా అమీర్ ఖాన్ కి వచ్చిన నష్టం ఏమి లేదు. సినిమాను హిందీ కాకుండా ఇక్కడ సౌత్ భాషల్లో కూడా విడుదల చేసారు. గీత ఆర్ట్స్ వాళ్ళు తెలుగులో 13 కోట్లకు డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. ఇక తమిళం లో 15.5 కోట్లకి ఉదయనిది స్టాలిన్ కి సంబంధిచిన రెడ్ జాయింట్ సంస్థ కొనుక్కుంది. ఇక కర్ణాటక, కేరళ కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్స్. ఇక హిందీ లో సినిమాను 100 కోట్లకు వైకామ్ 18 అనే సంస్థ కొనేసింది. ఈ సంస్థ పక్కా కమర్షియల్, బయర్స్ కి కాంట్రాక్టు రాయించుకుని మరీ సినిమా డిస్ట్రిబ్యూషన్ ఇస్తుంది. ఈ సంస్థ 67%: 33% ప్రాఫిట్ షేర్ ఒప్పందం పై థియేటర్ హక్కులు తీసుకుంది.

అలా అమీర్ ఖాన్ ప్రొడక్షన్ కంపెనీకి రావాల్సిన డబ్బు అందింది. సినిమా కోసం 120 నుండి 150 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు అందులో అటు ఇటు గా ఒక 50 నుండి 60 కోట్లు నష్టం అమీర్ ఖాన్ కి వచ్చి ఉండొచ్చు కానీ అది పెద్ద సమస్య కాదు. కానీ అప్పటికే థగ్ ఆఫ్ హిందూస్తాన్ సినిమా వల్ల నష్టపోవడంతో, సొంత ప్రొడక్షన్ లో సినిమా తీసాడు అమీర్ ఇది కూడా పోవడంతో నెక్స్ట్ అమీర్ సినిమా మీద ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. సినిమా బడ్జెట్ విషయంలో కానీ లేదా సినిమా మార్కెటింగ్ సమయంలో అమీర్ రేంజ్ తగ్గించుకోవాల్సి రావచ్చు. లాల్ సింగ్ చద్దా సినిమా వల్ల నష్టం కొనుగోలుదారులకే కానీ అమీర్ ప్రొడక్షన్ హౌస్ కి రాలేదు. కానీ అమీర్ భవిష్యత్ మీద మాత్రం ప్రభావం చూపుతుంది. అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం దేశం మీద వివాదస్పద వాఖ్యలు చేసిన వ్యక్తిని చిరంజీవి సపోర్ట్ చేయడం. ఆయనంత గొప్ప నటుడు లేడు అంటూ పొగడటం ఏమాత్రం బాగోలేదు. ఎంత గీత ఆర్ట్స్ సినిమా డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే మాత్రం అంతలా పొగడలా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Bhargavi

Recent Posts

పెళ్లి చేసుకోబోతుందా సంయుక్త మీనన్? ఇండస్ట్రీలో హాట్ టాపిక్

మలయాళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్…

22 minutes ago

ఈ ఒక్క పండు మీ గట్ నుంచి గుండె వరకు మార్పు తీసుకురాగలదా?

నేటి జీవనశైలిలో మార్పులు, అసమయ ఆహారం కారణంగా జీర్ణ సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ ఆహారాలకు…

23 minutes ago

వాట్సాప్‌లో కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్? వినియోగదారులకు రాబోయే మార్పులు ఇవే!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో కొత్త ప్రీమియం సేవలు అందుబాటులోకి రావచ్చని సమాచారం.…

28 minutes ago

మొబైల్ అలవాటు… సంతానంపై ప్రభావం? జేబులో ఫోన్ పెట్టే ముందు తెలుసుకోండి… మీ ఆరోగ్యానికి ఇది మంచిదేనా?

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవనశైలిలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అయితే దానిని ఎలా వాడుతున్నామన్నది ఆరోగ్యంపై ప్రభావం…

41 minutes ago

ఎండలో నల్లగా మారిన ముఖం? టానింగ్‌కు చెక్ పెట్టే నాచురల్ సీక్రెట్… పార్లర్ ఖర్చు సేవ్!

వేసవి కాలంలో ఎండ తీవ్రత పెరిగినకొద్దీ చర్మ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులపై టానింగ్ రావడం…

50 minutes ago

బాలకృష్ణతో మళ్లీ సినిమాలు ఎందుకు చేయలేదు? విజయశాంతి షాకింగ్ రివీల్!

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…

55 minutes ago