Political News

అమిత్ షా హైదరాబాద్ పర్యటన.. గణేష్ నిమజ్జనంలో పాల్గొననున్న కేంద్ర హోం మంత్రి!

హైదరాబాద్: కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ నేత అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఈ నెల 6న ఆయన భాగ్యనగర్‌కు రానున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు ఆయన వినాయక నిమజ్జన శోభాయాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.

పర్యటన వివరాలు:

  • శనివారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకుంటారు.
  • ఐటీసీ కాకతీయలో బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం.
  • మధ్యాహ్నం ఒంటి గంటకు చార్మినార్ వద్ద వినాయక శోభాయాత్రలో పాల్గొంటారు.
  • మధ్యాహ్నం మూడున్నరకు ఎంజే మార్కెట్ వద్ద ప్రసంగించనున్నారు.

పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ ఆంక్షలు:

అమిత్ షా రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. శోభాయాత్ర జరిగే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక సిబ్బందిని మొహరించారు.

గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు:

  • చంద్రగ్రహణం ఉన్నప్పటికీ శనివారం రోజునే నిమజ్జనం చేయాలని గణేష్ ఉత్సవ కమిటీ స్పష్టం చేసింది.
  • భారీ వర్షాల కారణంగా మండపాల నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
  • ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో నిమజ్జనం కోసం భారీ ఏర్పాట్లు జరిగాయి.
  • ట్యాంక్ బండ్ వద్ద పెద్దసంఖ్యలో క్రేన్లు ఏర్పాటు చేసారు.
  • రూ. 30 కోట్లతో నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్న జీహెచ్ఎంసీ, గ్రేటర్ పరిధిలో 74 పాండ్స్ తో పాటు పలు చెరువుల్లో నిమజ్జనాలకు ఏర్పాట్లు చేసింది.
  • ఇందులో 27 పర్మినెంట్ బేబీ పాండ్స్, 24 టెంపరరీ పోర్టబుల్ పాండ్స్ ఉన్నాయి.
  • నిమజ్జనం రోజున అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
  • మెట్రో అదనపు సర్వీసులు నడపనున్నారు.
telugudesk

Recent Posts

‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…

1 day ago

చూపు లేకపోయినా సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన వైకమ్ విజయలక్ష్మి!

చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…

1 day ago

కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!

మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…

1 day ago

కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే ఇంత మార్పా..? ముత్యాలపై నిపుణుల విశ్వాసం ఇదే!

భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…

1 day ago

ఒకే రాశి వాళ్లు పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది..? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…

1 day ago

ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…

1 day ago