హైదరాబాద్: కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ నేత అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఈ నెల 6న ఆయన భాగ్యనగర్‌కు రానున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు ఆయన వినాయక నిమజ్జన శోభాయాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.

పర్యటన వివరాలు:
- శనివారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకుంటారు.
- ఐటీసీ కాకతీయలో బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం.
- మధ్యాహ్నం ఒంటి గంటకు చార్మినార్ వద్ద వినాయక శోభాయాత్రలో పాల్గొంటారు.
- మధ్యాహ్నం మూడున్నరకు ఎంజే మార్కెట్ వద్ద ప్రసంగించనున్నారు.
పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ ఆంక్షలు:
అమిత్ షా రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. శోభాయాత్ర జరిగే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక సిబ్బందిని మొహరించారు.
గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు:
- చంద్రగ్రహణం ఉన్నప్పటికీ శనివారం రోజునే నిమజ్జనం చేయాలని గణేష్ ఉత్సవ కమిటీ స్పష్టం చేసింది.
- భారీ వర్షాల కారణంగా మండపాల నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో నిమజ్జనం కోసం భారీ ఏర్పాట్లు జరిగాయి.
- ట్యాంక్ బండ్ వద్ద పెద్దసంఖ్యలో క్రేన్లు ఏర్పాటు చేసారు.
- రూ. 30 కోట్లతో నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్న జీహెచ్ఎంసీ, గ్రేటర్ పరిధిలో 74 పాండ్స్ తో పాటు పలు చెరువుల్లో నిమజ్జనాలకు ఏర్పాట్లు చేసింది.
- ఇందులో 27 పర్మినెంట్ బేబీ పాండ్స్, 24 టెంపరరీ పోర్టబుల్ పాండ్స్ ఉన్నాయి.
- నిమజ్జనం రోజున అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
- మెట్రో అదనపు సర్వీసులు నడపనున్నారు.































