భారత్ లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న రాష్ట్రాలలో తమిళనాడు, ఢిల్లీ తర్వాత మహారాష్ట్ర అత్యధిక కోవిడ్ కేసులు ఉన్న రాష్ట్రంగా వార్తలల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ముంబైలో నివాసం వుంటున్న బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్ బి అమితాబచ్చన్ కి కరోనా పాజిటివ్ రావటంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అమితాబ్ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అమితాబ్ చికిత్సకి సానుకూలంగానే స్పందిస్తున్నారు. ‘భయపడాల్సిందే ఏమి లేదు. రాత్రి ఆయన ప్రశాంతంగా నిద్రపోయారని’ నానావతి ఆసుపత్రికి చెందిన వైద్యుడు డాక్టర్ అన్సారీ మీడియా ప్రతినిధులకు తెలియజేశారు.
తాజాగా కరోనా వైరస్ తోనే కాకుండా బిగ్ బీ అమితాబ్ కాలేయ, ఉదర సంబంధిత వ్యాధులతో కూడా బాధ పడుతున్న విషయం విదితమే. అయితే ఊహించని విధంగా అమితాబ్ తో పాటు అభిషేక్ కూడా కరోనా బారిన పడడంతో వారిద్దరు త్వరగా కోలుకోవాలని సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తమ ట్విట్టర్ ఖాతాలో సందేశాలు పంపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, ప్రిన్స్ మహేష్ బాబు, మాస్ మారాజు రవితేజ, టాలీవుడ్ కింగ్ నాగార్జున, అనుపమ్ ఖేర్, పరేష్, రావల్, సచిన్ టెండూల్కర్, రితేష్ దేశ్ ముఖ్, పరిణితీ చోప్రా తదితరులు అమితాబ్ కరోనా నుండి త్వరగా కోలుకొని సురక్షితంగా ఇంటికి చేరుకోవాలనిని కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి ఆనందించదగిన విషయమేమిటంటే.. జయా బచ్చన్, ఆరాధ్య, ఐశ్వర్య రాయ్‌లకి రిపోర్ట్స్ లో నెగెటివ్ వచ్చిందన్న సంగతి బిగ్ బీ ఫ్యాన్స్ కి కాస్త ఊరట కలిగించిందనే చెప్పాలి. ప్రస్తుతం అమితాబ్ ముంబై నానావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా అమితాబ్ స్వయంగా తనుంటున్న ఆస్పత్రి నుంచి ఓ సందేశాన్ని పంపించారు.
తన ఫ్యాన్స్ ను ఉద్దేశిస్తూ.. తనపై కొండంత ప్రేమ కురిపిస్తోన్న ఫ్యాన్స్ కు నమస్కరిస్తున్నట్లు, తనతో పాటు, అభిషేక్, ఐశ్వర్యా రాయ్, ఆరాధ్యల కోసం ప్రార్థనలు చేస్తోన్న ఫ్యాన్స్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నట్లు, తనపై అభిమానులు కురిపిస్తున్న ప్రేమ వర్షం అన్ని అడ్డుగోడలని కూడా బద్దలు కొడుతోందని, ఫ్యాన్స్ ప్రేమలో తాను పూర్తిగా తడిసి ముద్దయి పోయానని, తాను ప్రస్తుతం చీకటిలో ఉన్నప్పటికీ ప్రకాశిస్తూనే ఉన్నాని, అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని బాలీవుడ్ మెగాస్టార్ భావోద్వేగంతో కూడిన పోస్టును షేర్ చేశారు. అమితాబ్ పోస్టును చదివిన ఆయన ఫ్యాన్స్ భావోద్వేగానికి గురయ్యారు. ఇదిలా వుండగా.. తండ్రి అమితాబ్ బచ్చన్ తో పాటు అభిషేక్ కూడా నానావతి ఆస్పత్రి లోనే చికిత్స పొందుతున్నారు. తాజాగా అమితాబ్ నానావతి ఆస్పత్రి సిబ్బందిపై ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రాణాలకు తెగించి పోరాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలియ జేశారు. అంతేకాకుండా వైద్య సిబ్బంది అందర్నీ ఆయన దైవంతో పోల్చుతు ప్రశంసల జల్లు కురిపించారు. ఆ దైవమే అందరికీ అండగా ఉంటాడని తెలిపారు. కరోనా వైరస్ బారిన పడిన ఐశ్వర్య, ఆమె కుమార్తె ఆరాధ్య ఇంట్లోనే ఉంటూ కరోనా చికిత్స పొందుతున్నారు. ఇంతవరకూ తమ నటనా చాతుర్యంతో ప్రేక్షకులందరినీ అలరించిన బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ ఫ్యామిలీ వీలైనంత త్వరగా కరోనా మహమ్మారి నుండి కోలుకోవాలని మనమూ ఆశిద్దాం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…