Categories: FeaturedMovie News

సూపర్ స్టార్ రజనీకాంత్ ను టార్గెట్ చేస్తూ.. మెగా బ్రదర్ సంచలన ట్వీట్స్ !!

మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటున్నారు. రాజకీయ ప్రముఖులు కానీ, సినీ రంగ ప్రముఖులు కానీ చిరంజీవిపై, అలాగే పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకున్న సమయంలో వెంటనే వారి నాగబాబు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రతి విమర్శలకు మెగా ఫ్యాన్స్ మరియు జన సైనికుల నుండి మంచి స్పందనే వస్తుంది.

సోషల్ మీడియాలో నాగబాబుకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే. అయితే నాగబాబు అప్పుడప్పుడు మతం గురించో, దేవుడు గురించో చేసే ట్వీట్లు మాత్రం నెటిజనులనే కాకుండా అటు జన సైనికులను, ఇటుమెగా ఫ్యాన్స్ ను కూడా గందరగోళానికి గురి చేస్తున్నాయనడానికి ఉదాహరణగా తాజాగా ‘దేవుడు’ అన్న కాన్సెప్ట్ గురించి నాగబాబు చేసిన ట్వీట్ వైరలైంది. ఈ ట్వీట్ ఇంతిలా వైరల్ కావడానికి కారణమేమిటంటే.. సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్‌ని తన ట్వీట్ లో టార్గెట్ చేశాడు. తాజాగా దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని తీసుకొని త‌నకు తెలిసిన విశ్లేష‌ణను ఇచ్చే ప్రయత్నం చేశాడు. గ‌తంలో హిందూ దేవుళ్ళ‌పై విమ‌ర్శ‌లు చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాగ‌బాబు ఇప్పుడసలు దేవుడే లేడంటూ కొత్త‌గా ట్వీట్ చేయ‌డం అంద‌ర్నీ షాక్ కి గురి చేసింది. సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్ చేసిన కామెంట్‌ ఆధారంగా నాగ‌బాబు షేర్ చేసిన ట్వీట్ సారాంశం ఏమిటంటే..

మన కంటికి కనిపించేది ఏదైనా.. ఎవరో ఒకరు క్రియేట్ చేసిందే. లేకపోతే ఆ వస్తువుకి ఉనికి వుండదు. అలాగే ఇంతటి సువిశాల ప్రపంచం కూడా ఉనికిలో ఉందంటే దాన్ని కూడా ఎవరో ఒకరు క్రియేట్ చేసి ఉండాలి. ఆయ‌నే భగవంతుడు అని రజనీ కాంత్ చెప్పారు. ఆ ట్వీట్స్ ఆధారంగా నాగ‌బాబు స్పందిస్తూ `మరి ఈ విశాల ప్రపంచాన్ని క్రియేట్ చేసిన దేవుడిని క్రియేట్ చేసింది ఎవరు.? ఒక శక్తి ఉనికిలో ఉందంటే దానికి ఒక క్రియేటింగ్ రీజ‌న్ ఉండి తీరాలి. ఆ కారణమే దేవుడిని క్రియేట్ చేసి ఉండాలి. అలాగే ఆ దేవుడిని క్రియేట్ చేసిన రీజన్‌కు ఇంకో రీజ‌న్‌ ఉండి తీరాలి. So.. వెతుక్కుంటూ పోతే.. దానికి ఆది, అంతమే ఉండదు. So.. దేవుడు అనే కాన్సెప్ట్ కి అసలు అర్ధమే లేదు. కాబట్టి మనందరం దేవుడు లేకుండా ఎలా జీవించాలో నేర్చుకుంటే సరిపోతుంది. God is dead long back. So no worries. No guilt. BUT LIVE ACCORDING TO LAW. ” అంటూ తనదైన శైలిలో సూపర్ స్టార్ ర‌జ‌నీ కాంత్ కామెంట్స్ ను కొట్టి పారేశారు.

ఇంతవరకూ బాగానే వుంది. కానీ,. అసలు నాగబాబు ఏం చెప్పదలచుకున్నాడో అర్థం కాక అటు మెగా ఫ్యాన్స్, ఇటు జన సైనికులు బుర్ర గోక్కుంటున్నారు. పైగా మతం, దేవుడు ఈ 2 అంశాలు చాలా సున్నితమైనవి. వీటిపై ఇష్టానుసారంగా ఎడాపెడా అభిప్రాయాలను షేర్ చేయడం వలన భవిష్యత్తులో నష్టమే తప్ప లాభమేమీ ఉండదని మెగా ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago