Movie News

Amitabh Bachchan: అమితాబ్ ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎన్ని కోట్లో తెలుసా?

Amitabh Bachchan: ప్రముఖ బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలలో ఒకరిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని అగ్ర హీరోగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన వారిలో నటుడు అమితాబ్ బచ్చన్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.సుమారు 190 సినిమాలకు పైగా నటించిన అమితాబ్ ఇప్పటికి పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ఇకపోతే ఈయన కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా హాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాలలో నటించి పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ఎన్నో అవార్డులను తీసుకున్నటువంటి అమితాబ్ ఒక్కో సినిమాకు ఏకంగా కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునేవారు.

ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో ఉంటూ ఈయన భారీగానే ఆస్తులను కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఈయన కేవలం ముంబైలో మాత్రమే కాకుండా విదేశాలలో కూడా ఖరీదైన ఆస్తులను కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇలా గత ఐదు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి అమితాబచ్చన్ ఇప్పటివరకు సుమారు 3200 కోట్లకు పైగా ఆస్తులను పోగు చేశారని తెలుస్తుంది.

Amitabh Bachchan: కోట్లలో అమితాబ్ వార్షిక ఆదాయం..

ఇక ఈయనకు ముంబైలో ఖరీదైన ప్రాంతాలలో లగ్జరీ అపార్ట్మెంట్లో ఉన్నాయని ఈ అపార్ట్మెంట్స్ విలువ సుమారు 300 కోట్ల వరకు ఉంటుందని సమాచారం ఇక ఇండియాలోనే కాకుండా ఈయన ఫ్రాన్స్ లో కూడా ఖరీదైన ఆస్తులను కొనుగోలు చేశారని తెలుస్తోంది.ఇక ప్రస్తుతం ఈయన ఎనిమిది పదుల వయసులోకి అడుగుపెట్టిన కానీ వరుస సినిమాలు యాడ్స్ ద్వారా భారీగా సంపాదిస్తున్నారు. ఈయన ఒక్కో యాడ్ ద్వారాఐదు కోట్ల రూపాయల సంపాదిస్తున్నారట ఇలా ఈయన వార్షిక ఆదాయం సుమారు 60 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. సినిమాలు యాడ్స్ మాత్రమే కాకుండా బుల్లితెరపై కౌన్ బనేగా కరోడ్ పతి అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago