Amithab Bachchan: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈయన తన అభిమానుల కోసం గత 50 సంవత్సరాలుగా ఒక పని తప్పకుండా చేస్తున్నారని తెలుస్తుంది.
సాధారణంగా అభిమాన హీరోలను చూడటం కోసం పెద్ద ఎత్తున అభిమానులు వారి ఇంటి ముందు పడిగాపులు కాస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఆదివారం అమితాబ్ ఇంటి ముందు ఎంతోమంది అభిమానులు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారట. ఇలా తనకోసం వచ్చిన వారిని కలవడం కోసం అమితాబ్ ప్రతి ఆదివారం ఉదయం తన బాల్కనీలో కొంత సమయం పాటు అభిమానుల కోసం కేటాయిస్తారని తెలుస్తోంది.
ఈ ఆచారం గత 50 సంవత్సరాలుగా కొనసాగుతుందని తెలియజేశారు. అయితే ఆయన ఏదైనా సినిమా షూటింగ్ పనుల నిమిత్తం ముంబైలో లేకపోయినా ఈ విషయాన్ని రెండు రోజులు ముందుగానే తెలియజేస్తారట. ఇక ఆదివారం ఉదయం బాల్కనీలో కొంత సమయం పాటు ఉండి అక్కడికి వచ్చినటువంటి అభిమానులకు నమస్కారం చేయడమే కాకుండా వారితో కాసేపు ముచ్చటిస్తారని తెలుస్తోంది.
ఈ విధంగా 50 సంవత్సరాలుగా ప్రతి ఆదివారం అభిమానుల కోసం కొంత సమయం కేటాయించడమే కాకుండా వారిని కలిసే సమయంలో అమితాబ్ చెప్పులు కూడా వేసుకోరని తెలుస్తోంది. ప్రేక్షకులు తమకు దేవుళ్ళతో సమానమని భావించిన అమితాబ్ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎలాగైతే చెప్పులు వేసుకోమో అలాగే ప్రేక్షక దేవుళ్లను చూసేటప్పుడు కూడా చెప్పులు వేసుకోకూడదన్న భావనలో ఆయన చెప్పులు లేకుండా అభిమానులతో మాట్లాడతారని తెలిసి అమితాబ్ ప్రేక్షకులకు ఇచ్చే గౌరవ మర్యాదలపై నేటిజన్స్ ఫిదా అవుతున్నారు.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…