Amma Rajashekhar : ‘రణం’ సినిమాతో డైరెక్టర్ గా మారిన అమ్మ రాజశేఖర్ మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ వెంటనే రవితేజ హీరోగా ‘ఖతర్నాక్’ సినిమా తీసినా అది ఆశించినంత విజయం సాధించకపోవడంతో కెరీర్ గాడి తప్పింది. చాలా మంది హీరోలకు డాన్స్ కంపోజ్ చేసి హిట్ సాంగ్స్ ఇచ్చిన అమ్మ రాజశేఖర్ డైరెక్టర్ గా అంత సక్సెస్ కాలేదు. ఇక నితిన్ తో ‘టక్కరి’ సినిమా చేసినా అది డిజాస్టర్ అయి కూర్చుంది. ఇక చాలా మంది ఇండస్ట్రీ లో నన్ను మోసం చేసారంటూ ఇటీవల పాల్గొన్న పలు ఇంటర్వ్యూల్లో అమ్మ రాజశేఖర్ కామెంట్స్ చేసాడు. ఇక ప్రభాస్ తో సినిమా కాస్తా నితిన్ కి ఎలా పాయిందో వివరించారు.
ప్రభాస్ వెయిట్ చేయించాడని నితిన్ తో సినిమా చేశాను…
రణం సక్సెస్ తో మంచి ఆఫర్లు వచ్చినా అమ్మ రాజశేఖర్ సరిగా ఉపయోగించుకోలేదు. ఇక కొన్ని సినిమాలు డిజాస్టర్లు గా మిగిలితే మరికొన్ని సినిమాలు విడుదల జాప్యం జరిగి నిర్మాతలతో గొడవలతో కొన్ని సినిమాలు నిలిచిపోయాయి. ఇక చిరంజీవి, ప్రభాస్ వంటి హీరోలతో సినిమాలు చేయడానికి అంతా సిద్ధమైన ప్రభాస్ కి కథ చెప్పడానికి వెళ్లాల్సి ఉండగా అదే సమయంలో బాలకృష్ణ వైవిఎస్ చౌదరి గారి సినిమాలో ఒక పాట డాన్స్ కంపోజ్ చేయడానికి అడగడం తో వెళ్లి వచ్చాక కథ చెప్పాలనుకుంటే మూడు రోజులు ఆలస్యం అవడంతో సిట్యుయేషన్ మారిపోయింది. కథ చెప్పడానికి ప్రభాస్ ఇంటికి వెళితే ఆయన లోపల ఉన్నా వేరే డిస్కషన్ లో ఉన్నారు వెయిట్ చేయమని చెప్పారు.
నేను వెయిట్ చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో అదే సమయానికి నితిన్ ఫోన్ చేసాడు ప్రాజెక్ట్ చేద్దామని, నితిన్ ఫోన్ హోల్డ్ లో పెట్టి మరోసారి ప్రభాస్ మేనేజర్ ను అడిగాను. సార్ ఉన్నారు కనీ వెయిట్ చేయాలి మూడ్ బాగోలేదు అని చెప్పారు. ఇక వెంటనే నితిన్ కి ఫోన్ లోనే మనం సినిమా చేస్తున్నాం అని చెప్పేసాను. రణం సినిమాతో గోపిచంద్ ను స్టార్ చేశాను నితిన్ చేయలేనా అనిపించింది. టక్కరి సినిమా తీసాను అది డిజాస్టర్ అయింది. కాస్త ఓపిగ్గా ఎదురుచూసి ప్రభాస్ దగ్గర కథ చెప్పి ఓకే చెయించుకుని ఉంటే సినిమా ఇంకోలా ఉండేది అంటూ చెప్పారు అమ్మ రాజశేఖర్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…