మారుతున్న కాలానికనుగుణంగా ప్రేక్షకుల తీరు, అభిరుచి అన్నీ మారిపోతున్నాయి. ను సినిమాల కంటే నటీనటుల మాటల తూటాలు, పంచ్ డైలాగ్స్ చూసి ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే తాజాగా ఓ బుల్లితెర షోలో పాల్గొన్న ‘అమ్మోరు’ ఫేమ్ సునయన బోల్డ్ కామెంట్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. అందరిముందే అమ్మాయిలు, అబ్బాయిలు.. ఆంటీలు అంటూ అడల్ట్ డైలాగ్స్ వదలడంతో ఆ షోలో ఉన్నవాళ్ళంతా ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ‘వావ్ 3’షో లో కౌముది, మంగ్లీ, నిఖిల్‌లతో కలిసి సునయన పాల్గొంది. తాజాగా ఈ షో తాలూకా ప్రోమో వీడియో విడుదలైంది.
సాయి కుమార్ హోస్ట్‌గా వస్తున్న ఈ షోలో సునయన భలే హుషారుగా కనిపించింది. నిఖిల్‌కి పంచులేస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. ఇందులో భాగంగానే ‘అబ్బాయిలు ఆంటీలతోనే చెకవుట్ చేస్తారు. వాళ్లకు అమ్మాయిలు అంత ఈజీగా పడరు’ అంటూ ఓపెన్ గా హాట్ కామెంట్స్ చేయడంతో ఆ షో హోస్ట్ సాయి కుమార్ తో సహా అంతా షాకయ్యారు. ఈ ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కోడి రామకృష్ణ తెరకెక్కించిన ‘అమ్మోరు’ సినిమాలో బాలనటిగా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది సునయన. చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో అవార్డులను అందుకున్న ఆమె దాదాపు 30 సినిమాల్లో నటించింది. అలా కొన్ని బుల్లితెర సీరియల్స్ లో నటించిన సునయన ప్రేక్షకులను బాగానే అలరించింది.
పెళ్ళైన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్షమై సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈమధ్యనే మళ్ళీ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సునయన “ఓ బేబీ ” చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కూతురిగా తన నటనతో ఆకట్టుకుంది. దీంతో సునయనకు వరుసగా సినిమా ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం సునయన ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుమారుడు పూరి ఆకాష్ హీరోగా నటిస్తున్న “రొమాంటిక్” చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…