ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ మరి కొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే బిగ్ బాస్ సీజన్ 5 లోపాల్గొనే కంటెస్టెంట్ లు వీళ్లేఅంటూ గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ కంటెస్టెంట్ లలో యాంకర్స్, యూట్యూబర్స్, బుల్లితెర నటీనటులు ఉన్నారని సమాచారం.
ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కి సంబంధించి సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లోకి యూట్యూబ్ స్టార్ షణ్ముఖ జశ్వంత్ వెళ్లనున్నారని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే షణ్ముఖ జస్వంత్ సీజన్ ఫైవ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ పొందుతున్నారనే వార్త కూడా వినబడుతుంది.
ఈ క్రమంలోనే ఈ కంటెస్టెంట్ మీద ప్రోమో షూట్ చేయడానికి బిగ్ బాస్ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాలంటే బిగ్ బాస్ అధికారికంగా వెలువరించాల్సి ఉంది.
ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమానికి యాంకర్ గా రానా వ్యవహరిస్తారనే వార్తలు వస్తున్నప్పటికీ సీజన్ ఫైవ్ కి కూడా గత సీజన్ లో మాదిరిగానే నాగార్జున హోస్ట్ గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రోమో కోసం నాగార్జున పై షూటింగ్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం బిగ్ బాస్ సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రసారం కానుందని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…