Analists Dasari Vignan & Damu Balaji : సోషల్ మీడియా మొత్తం ఒకటే చర్చ నడుస్తోంది అది మంచు మనోజ్ పెళ్లి. మంచు మనోజ్ తన రెండవ వివాహం అందరూ అనుకున్నట్లుగానే దివంగత భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనిక రెడ్డిని చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి గురించి అనేక విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక మంచు మనోజ్ పెళ్లి గురించి కుటుంబానికి దూరంగా ఉంటున్న విషయం గురించి అనలిస్ట్స్ దాసరి విజ్ఞాన్ అలాగే దాము బాలాజీ మాట్లాడారు.
మోహన్ బాబుకి ఇష్టం లేదు అందుకే పెళ్లి అక్కడ…
మోహన్ బాబు గారికి మంచు మనోజ్ మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటూ దాసరి విజ్ఞాన్, దాము బాలాజీ అభిప్రాయపడ్డారు. మొదటగా వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నపుడు కూడా మోహన్ బాబు గారికి ఇష్టం లేకపోవడం వల్లే వాళ్ళ పెళ్లి జరగలేదని చెప్పారు. విష్ణు విషయంలో కూడా నచ్చక పోయినా కుటుంబం మొత్తం ఒక్కటై ఒప్పించారట. ఇక మనోజ్ విషయంలో అసలు ఒప్పుకోలేదట మోహన్ బాబు కానీ విష్ణు భార్య వెరోనిక స్నేహితురాలు బంధువు అవ్వడం వల్ల చేసుకోవాలని అనుకున్నపుడు ఇక ఒప్పుకున్నారట. వేరే కులం వాళ్లనే కొడుకులు పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకి నచ్చలేదని అభిప్రాయపడ్డారు. ఇక ఇప్పుడు రెండో వివాహం అప్పుడు కూడా ఆయనకు పూర్తిగా ఇష్టంలేదని కానీ ఒప్పుకున్నారంటూ టాక్ వినిపిస్తోందని చెప్పారు.
ప్రణీత రెడ్డిని వివాహాం చేసుకున్న మంచు మనోజ్ ఆ తరువాత ఎక్కువ కాలం వారు కలిసి లేరు విడిపోయారు. విడిపోయాక మంచు మనోజ్ కుటుంబానికి కూడా దూరం జరిగాడు. మోహన్ బాబు గారు కొత్త ఇల్లు కట్టించుకుని సిటీ కి దూరంగా ఉండగా మంచు మనోజ్ సపరేట్ ఇంట్లో ఫిల్మ్ నగర్ లోనే ఉంటున్నాడు. ఇక సినిమాల పరంగా కూడా మనోజ్ కి సపోర్ట్ లేదంటూ దాసరి విజ్ఞాన్, దాము బాలాజీ అభిప్రాయపడ్డారు. మనోజ్ నటించిన కొన్ని సినిమాలు ఫైనాన్సియల్ సమస్యల వల్ల విడుదల కాలేదని, కుటుంబంలోని వారే మనోజ్ ను పట్టించుకోలేదనే టాక్ నడుస్తోంది. ఇప్పుడు కూడా మనోజ్ మౌనిక సెపరేట్ గానే ఉంటారని కుటుంబానికి దూరంగా ఉండవచ్చు అంటూ అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…