Analyst Damu Balaji : సరూర్ నగర్ అప్సర హత్య కేసులో ఇప్పటికే సాయి కృష్ణ తానే చంపినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. అయితే ఈ కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ తెలుస్తోంది. అప్సర బ్యాక్ గ్రౌండ్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె మొదటి భర్త మరణం, ఆపైన హైదరాబాద్ కి తల్లి కూతుళ్ళు రావడం, ఇక్కడ సాయికృష్ణతో ఎఫైర్ వంటి విషయాల మీద ఇప్పటికే పలు కథనాలు వినిపించాయి. అయితే తాజాగా పోలీసులు సాయి కృష్ణ అప్సర ను ఎలా హత్య చేసాడు, ఆమెను ఎలా మాన్ హోల్ లో వేసి సాక్ష్యాలు లేకుండా చేసాడో రీ కన్స్ట్రక్షన్ కార్యక్రమం జరిపారు. అయితే సాయికృష్ణ తండ్రి పోలీసుల ఎదుట చెప్పిన ఆసక్తికర విషయాల గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.
అప్సర బ్యాంకు అకౌంట్ చూడండి…
సాయికృష్ణ తండ్రి మొదటి నుండి తన కొడుకు తప్పు చేయలేదని అప్సర బాగా వేధించింది అంటూ చెప్పుకొస్తుండగా తాజాగా సాయికృష్ణ ను పోలీసులు విచారించగా అందులో సాయికృష్ణ తండ్రి పోలీసులతో అప్సర అలాగే ఆమె తల్లి బ్యాంకు అకౌంట్లను పరిశీలించాలని చెప్పడం జరిగింది అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.
అప్సర టార్చర్ భరించలేక మా అబ్బాయి ఇలా చేసాడు అంటూ సాయికృష్ణ తండ్రి చెబుతున్నా నిజానికి ఆమె అంత వేదిస్తుంటే పెద్దవాళ్లకు చెప్పుండొచ్చు లేక పోలీసుల సహాయం తీసుకుని ఉండవచ్చు, హత్య చేయడం ఏమిటి అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. అప్సర ఎలాంటి మహిళ అయినా సాయికృష్ణ ఒక నిండు ప్రాణాన్ని తీసుకొన్నాడు. అది శిక్షార్హం అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…