Rashmika: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు మేనేజర్ లో ఉండడం సర్వసాధారణం.హీరో హీరోయిన్లకు అవకాశాలు రావాలన్న మేనేజర్ల కృషి ఎంతో ఉంటుంది అలాగే వారి ఆర్థిక వ్యవహారాలు చూసుకోవాలన్నా కూడా మేనేజర్ పాత్ర ఎంతో ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరూ కూడా మేనేజర్లను నియమించుకొని వారి బాధ్యతలు అన్నిటిని వారికి అప్పజెబుతారు.సెలబ్రిటీలకు మంచి సినిమా అవకాశాలను కనుక తీసుకువస్తే మేనేజర్లకు కూడా భారీగా లాభాలు ఉంటాయి.
అందుకే సెలబ్రిటీలకు మేనేజర్లగా వ్యవహరించడానికి చాలామంది ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇదే అదునుగా భావించి చాలామంది మేనేజర్లు సెలబ్రిటీలను మోసం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఎంతోమంది సెలబ్రిటీలు మేనేజర్ల చేతిలో మోసపోయి కొన్ని లక్షలు కోట్ల రూపాయలను నష్టపోయిన వారు ఉన్నారు. ఈ క్రమంలోని తాజాగా నటి రష్మిక మందన్న సైతం తన మేనేజర్ చేతిలో దారుణంగా మోసపోయారని తెలుస్తోంది.
గత కొంతకాలంగా తన వద్ద మేనేజర్ గా ఉన్నటువంటి వ్యక్తి రష్మికకు తెలియకుండా దాదాపు 80 లక్షల రూపాయల వరకు ఫ్రాడ్ చేశారని తెలుస్తోంది.ఈ విషయం ఆలస్యంగా ఆమెకు తెలియడంతో తీవ్రస్థాయిలో సదరు మేనేజర్ పై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా తనని తొలగించారని సమాచారం. ఈ విధంగా రష్మిక మేనేజర్ చేతిలో దారుణంగా మోసపోయారని తెలుస్తుంది.
ఈమె వరస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉండగా తన వ్యవహారాలన్నింటిని మేనేజర్ చూసుకోవడంతో ఈమె పెద్దగా ఆర్థిక వ్యవహారాలను పట్టించుకోవడం లేదట దీంతో ఆయన మోసానికి పాల్పడ్డారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి రష్మిక ఎక్కడ అధికారక ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే ఈమె ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ తో పాటు ఇతర సినిమాల్లో షూటింగ్లలో కూడా బిజీ అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…