Analyst Damu Balaji : పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీత గా సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటించిన ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆదిపురుష్. మొదటి నుండి ఈ సినిమా వివాదాల నడుమ సాగింది. మొదట విడుదల చేసిన ఫస్ట్ లుక్ తోనే రాముడికి మీసాలేంటి అంటూ చర్చలు మొదలవ్వగా ఇక గ్రాఫిక్స్ ఏం బాగోలేవని ట్రోల్స్ మొదలవడంతో మళ్ళీ సినిమా గ్రాఫిక్స్ విషయంలో శ్రద్ధ తీసుకున్నారు. ఇక లేటెస్ట్ గా సినిమా విడుదల అయి వసూళ్ల విషయంలో రికార్డు సృష్టిస్తున్న ఆదిపురుష్ సినిమా మీద వివాదలు మాత్రం పోలేదు. రామాయణం ఇలా చూపించాడేంటి అంటూ కొంతమంది పెదవి విరుస్తుంటే మరికొంతమంది కొత్తగా చూపించాడు అంటూ అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమా గురించి అనలిస్ట్ దాముబాలాజీ మాట్లాడారు.
సినిమా మీద ట్రోల్స్ కి కారణం అదే…
ఆదిపురుష్ సినిమా విషయంలో రాముడి మీసం దగ్గరినుండి ట్రోల్స్ మొదలయ్యాయి. అయితే నా కోణంలో రామాయణం చూపాను అంటూ ఓం రౌత్ చెబుతున్నా ముందు నుండి మన నర నరానా జీర్ణించుకుపోయిన రామయణంని మనం ఇప్పటికీ ఉహించుకుంటున్నాం అంటూ బాలాజీ తెలిపారు. రామాయణం తెలిసిన పాత తరం వాళ్లకి సినిమా రుచించందు కని కొత్త తరం వారి రామాయణం అవగాహనా లేని వారికి సినిమా నచ్చుతోందని ముఖ్యంగా ఇప్పటి పిల్లలు సినిమాను ఎంజాయ్ చేస్తున్నారని బాలాజీ తెలిపారు. సినిమాలో సంభాషణలు ఇప్పటివారికి అర్థమవ్వడం కోసం సహజంగా పెట్టారు. అలాగే రావణుడి తలలు రెండు వరుసలలో ఉండటం వంటి విషయాలు కొత్తగా అనిపించడం వల్ల జనాలు ఆకలింపు చేసుకోలేకపోతున్నారు.
నిజానికి రావణుడి తలలు అలానే ఉంటాయి అనడానికి మనం ఎవరమూ చూడలేదు. కాకపోతే ముందు సినిమాల్లో చూయించిన దాన్నే మనం నమ్మేస్తున్నాం. ఓం రౌత్ సినిమా విడుదలకి ముందే స్పష్టంగా నేను చిన్నప్పటి నుండి నా జీవితంలో చూస్తున్న రామాయణంను తీశానని చెప్పాడు. కానీ అవన్నీ వదిలేసి ట్రోల్ చేస్తున్నారు. మరికొంతమంది రామాయణంను ఎలా పడితే అలా తీయడం వల్ల భవిష్యత్తులో మరికొతమంది వాళ్లకు నచ్చినట్లు రామాయణంను కించపరిచే అవకాశం ఉంది అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…