Senior Heroine Meena : మీనా తెలుగు తెరకు పరిచయం అక్కరలేని పేరు. తమిళ అమ్మాయి అయినా కూడా తెలుగు ప్రేక్షకులు ఆమెను మన అమ్మాయి అనుకున్నారు. తొంభైలలో అగ్ర హీరోయిన్లలో ఒకరిగా ఉన్న మీనా బాలనటిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సక్సెస్ లు చూసింది. ఇక పెళ్లయ్యాక కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న మీనా కూతురు నైనిక పెద్దగా అయ్యాక మళ్ళీ సినిమాల వైపు చూస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మెప్పించారు. దురదృష్టవషాత్తు అంతా సాఫిగా ఉన్న మీనా గారి జీవితంలో ఆమె భర్త పోస్ట్ కోవిడ్ సమస్యల కారణంగా మరణించడం ఆమెను క్రుంగదీసింది. కానీ మళ్ళీ ఆమె ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. ఆమె లైఫ్ లో ఎదురైన ఈ బాధాకర విషయం గురించి మీనా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
అందుకే సినిమాల్లో బిజీ అయ్యాను…
మీనా భర్త ఆరోగ్యం కోసం చాలా పోరాడారు. తన భర్తకు మెరుగైన చికిత్స అందించడం కోసం చాలా కష్టపడ్డారు. కానీ ఆయన మరణించడంతో కూతురు కోసం తనని తాను స్ట్రాంగ్ గా చేసుకుని బాధను మరచిపోడానికి స్నేహితులతో కలిసి విదేశాలకు వెళ్ళివచ్చారు. ఇక మళ్ళీ సినిమాల్లో మీనా నటిస్తారో లేదు తెలియని సంధిగ్దం ఇండస్ట్రీలో ఉండగా మీనా మాత్రం పనిలో పడితే మార్పు వస్తుందని భావించి మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యారు.
అలా తెలుగులో ఇటీవల ఎస్వి కృష్ణా రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమాలో నటించిన ఆమె అంత బాధలో కూడా నటించడానికి గల కారణాలను వివరించారు. తనకు ఈ విషయంలో తన సీనియర్స్ స్ఫూర్తి అంటూ ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మన పని మనం చేయాలి అని వారి దగ్గరే నేర్చుకున్నాను అంటూ చెప్పారు. కష్టపడి పని చేస్తే మన వ్యక్తిగత బాధలను కాసేపైనా మర్చిపోతామంటూ చెప్పారు. ఇక తన రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…