Analyst Damu Balaji : కెసిఆర్ అనారోగ్యం డ్రామా… హాస్పిటల్ రిపోర్ట్స్ లో అసలేముంది…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : తెలంగాణ ఎన్నికల్లో ఈసారి కెసిఆర్ ప్రభుత్వాన్ని కాదని తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. ఇక సీఎంగా రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకుంటుండగా కెసిఆర్ అనారోగ్యంతో యశోధ హాస్పిటల్ లో చేరడం ఇపుడు తెలంగాణ రాష్ట్రంలో చర్చకు దారి తీసింది. రాజకీయ ప్రముఖులు, సన్నిహిత వర్గాలందరూ ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటుంటే చాలా మంది మాత్రం ఇదంతా కెసిఆర్ డ్రామా అంటూ కొట్టిపారేస్తున్నారు. ఇక అసలు ఇందులో ఉన్న నిజానిజాల గురించి అనలిస్ట్ దాము బాలాజీ ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు.

కెసిఆర్ డ్రామా చేస్తున్నారా… లేక నిజమా…

అరవై ఏళ్లు పైబడిన కెసిఆర్ తాజాగా తన తుంటి ఎముక విరగడంతో యశోధ హాస్పిటల్ లో సర్జరీ చేయించుకున్నారు. కోలుకోవడానికి కొన్ని వారాల సమయం పడుతుందని వైద్యులు చెబుతుండగా ఇదంతా అసెంబ్లీకి రాకుండా కెసిఆర్ ఆడుతున్న డ్రామా అంటూ అవినీతి కేసుల్లో జైలుకి వెళ్లాల్సి వస్తుందని ఇలా చేస్తున్నాడంటూ అనేక రకాల కామెంట్స్ వినిపిస్తున్న సమయంలో బాలాజీ మాట్లాడుతూ ఆయనకు డ్రామా చేయాల్సిన పనిలేదని, సుధీర్ఘ రాజకీయ అనుభవంలో ఎన్నో ఒడిదుడుకులను చూసిన ఆయన ప్రతిపక్షంలో ఉండటానికి భయపడే రకం కదంటూ అభిప్రాయపడ్డారు.

ఇక ఆయన నిజంగా డ్రామా చేసుంటే సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్య కార్యదర్శిని పంపి ఆయనకు భద్రత కల్పించాలని ఎందుకు చెప్తారు అంటూ బాలాజీ వివరించారు. ఇక నెటిజన్స్ చేస్తున్న ట్రోల్స్ గురించి మాట్లాడుతూ కెసిఆర్ మీద తెలంగాణ సమాజంలో ఉన్న వ్యతిరేకత ఇలా బయటపడుతోందని చెప్పారు

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago