Featured

Analyst Damu Balaji : చక్రం సినిమాను తలపించే రియల్ స్టోరీ… చనిపోతానని ముందే తెలిసి భార్యకు విడాకులు ఇచ్చి… కన్నీరు తెప్పిస్తున్న డాక్టర్ హర్షవర్ధన్ కథ…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balajj : ఈ భూమి మీద పుట్టిన ఏ జీవి అయినా మరణించక తప్పదు. వైద్యం ఎంత అభివృద్ధి చెందినా మన మరణనాన్ని ఆపలేదు. అందరం మరణించే వాళ్ళమే అయినా కొంచం ముందు వెనుక వెళ్తాము. కానీ ఆ మరణం మనకు ఎపుడు వస్తుందో తెలియకుండా బ్రతికేస్తున్న మనకు మన మరణం పలానా రోజు అని తెలిస్తే ఎలా జీవిస్తాం, మన ఎక్పైరి డేట్ తెలిస్తే బతకాగలమా, నిరాశలో ఉండిపోతామా. ఇలాంటి పరిస్థితే ఖమ్మంకి చెందిన డాక్టర్ హర్షవర్ధన్ కి ఎదురైంది. తాను మరణించేదెపుడో డాక్టర్లు చెప్పేసినా ఏ మాత్రం అధైర్యపడకుండా చావును చిరునవ్వుతో ఆహ్వానించాడు హర్ష. మరణాన్ని కూడా ఎంతో పద్దతిగా తన అనుకున్నవాళ్లకు భారం కాకుండా ఎవరి కంటా కన్నీళ్ళు రాకుండా తాను మానసికంగా దృడంగా ఉండటమే కాకుండా తన వాళ్లను సిద్ధం చేసి వెళ్ళాడు, మనందరికీ స్ఫూర్తి నింపాడు డాక్టర్ హర్ష వర్ధన్. ఇక ఆయన గురించి అనలిస్ట్ దాము బాలాజీ ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు.

చనిపోతానని భార్యకు విడాకులు…

హర్ష వర్ధన్ పెళ్ళైన వెంటనే ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. మళ్ళీ లాక్ డౌన్ కారణంగా ఆయన ఇండియా కానీ ఆయన భార్య ఆస్ట్రేలియా కాని వెళ్లలేని పరిస్థితి. అదే సమయంలో పెళ్ళైన ఎనిమిది నెలలు సమయంలోనే తనకు కాన్సర్ వ్యాధి సోకిందని అదికూడా 4త్ స్టేజిలో ఉందని తెలిసింది హర్షకు. మొదట్లో ఆ నిజాన్ని జీర్ణించుకోడానికి సమయం తీసుకుని బాధపడినా ఆ తరువాత తాను చేసిన పనులను చూస్తే ఇలా కూడా ఆలోచిస్తారా, ఒక్కోసారి నిజం కూడా కల్పితం కన్నా ఎక్కువ నమ్మలేని విధంగా ఉంటుంది అనేలా ఉంది హర్ష లైఫ్ స్టోరీ అంటూ దాము బాలాజీ అభిప్రాయాపడ్డారు. ఫిక్షన్ రియల్ కాదు కానీ ఒక్కోసారి నిజమైన స్టోరీనే ఫిక్షన్ కంటే ఊహాతీతంగా ఉంటుంది, నమ్మలేని విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏపూరి హర్షవర్ధన్ కథ కూడా అలానే ఉంది. తాను మరణిస్తున్నానని అధైర్య పడలేదు అక్కడితో ఆగి పోలేదు. తన భార్య జీవితం మోడుబారకూడదని అలోచించి ఆమెను ఒప్పించి విడాకులు తీసుకుని ఆమెకు చేయాల్సిన ఆర్థిక భరోసా ఇచ్చిన ఆమెను అమెరికాలో చదివించడానికి ఏర్పాట్లను చేసారు.

ఇక కుటుంబ సభ్యులకు మిత్రులకు తాను మరణించాక ఎటువంటి భారం కాకుండా తన చావుకు తానే అన్ని ఏర్పాట్లను చేసుకున్నారు. ఇలాంటి వ్యక్తిత్వం మనం ఎక్కడా చూడలేమేమో అందుకే హర్ష మరణించినా తన వారిజ్ఞాపకాలలో బ్రతికే ఉంటారు. అయితే ఆయన భార్య విడిపోయినా ఆమె పరిస్థితే కొంత ఇబ్బందికరంగా ఉంటుందంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. ఆమె హర్ష భార్య అని తెలిసిన వాళ్ళు హర్ష నీకన్నీ చేసే వెళ్ళాడట కదా అంటూ మాట్లాడటం, అదీకాక ఆ అమ్మాయి హర్ష ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవడం వల్ల ఆమెకు ఆ బాధ ఇపుడే తగ్గదు. ఆమె మామూలు మనిషి కావడానికి సమయం పడుతుంది అంటూ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago