Analyst Damu Balaji : 2019 ఎన్నికల ముందు రాష్ట్రంలో సంచలనం రేపిన హత్య కేసు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. తన ఇంట్లోనే రాత్రి బాత్రూంలో శవమై కనిపించారు వివేకానంద రెడ్డి. ఈ హత్య మీద విచారణ తొలుత రాష్ట్ర పోలీసులు చేసినా కేసును తప్పుదోవ పట్టిస్తున్నారనే అనుమానంతో వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కోర్ట్ ను ఆశ్రయించి పక్క రాష్ట్రం అయిన తెలంగాణ సిబిఐ కి ట్రాన్సఫర్ చేయించుకున్నారు. జగన్ సొంత బాబాయ్ హత్య, చేతిలో అధికారం, అయినా కేసులో ఒక్క అడుగు ముందుకు పడకపోవడం అందరినీ ఆశ్చర్యం కలిగించే అంశం. ఇక రోజుకో మలుపు తిరుగుతూ సంచలనం కలిగిస్తున్న ఈ కేసులో అవినాష్ రెడ్డిని తరచూ సిబిఐ విచారిస్తుండగా అరెస్టు తప్పదు అనే వార్తలు ఆ మధ్య బలంగా వినిపించినా తాజాగా ఈ కేసు ఇప్పుడు మరిన్ని మలుపులు తిరుగుతోంది. కేసులో అవినాష్ రెడ్డి తప్పుకోవచ్చు అనే సంకేతాలు కనిపిస్తున్నాయని అనలిస్ట్ దాము బాలాజీ అభిప్రాయపడ్డారు.
కేసులో ప్రధాన నిందితుడికి బెయిల్…
వివేకానంద రెడ్డి కేసులో నలుగురు వ్యక్తులు కలిసి ఆయనను హత్య చేసారు. ఈ హత్యలో ప్రధాన నిందితుడైన దస్తగిరి కోర్టులో అప్రూవర్ గా మారిపోయి నిజాన్ని ఒప్పుకోవడం జరిగింది. అయితే అలాంటి ప్రధాన నిందితుడికి కడప కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ బెయిల్ ను సవాలు చేస్తూ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అలాగే మిగిలిన నిందితులుగా పరిగనింపబడుతున్న ఏర్ర గంగిరెడ్డి, తదితరులు పిటిషన్ వేశారు. ఇక వివేకానంద రెడ్డి వద్ద వాచ్ మెన్ గా ఉన్న రంగయ్య ను విచారించినపుడు నలుగురు వ్యక్తులు వివేకానందను చంపడానికి లోపలికి రావడం చూసానని, నేను తోటలోకి పారిపోయానని చెప్పాడు. ఇక గూగుల్ టేక్ అవుట్ లో కూడా ఆ నలుగురి కాంటాక్ట్ వెతికినపుడు వివేకానంద ఇంటివద్ద లభ్యం అవడం కేసుకు మరింత బలాన్ని చేకూర్చిందని తెలిపారు బాలాజీ.
ఇక ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి కూడా తనను విచారించిన రికార్డింగ్స్ కి సంబంధించినవి కావాలని కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసారు. తన తరుపు న్యాయవాది ద్వారా అవినాష్ తప్పించుకునే మార్గాలను పటిష్టం చేస్తుంకుంటున్నారనే విషయం తెలుస్తోంది. అయినా ఒక న్యాయస్థానం ఒక ప్రధాన ముద్దాయిని అది కూడా తానే చేసానని ఒప్పుకున్న నిందితుడికి బెయిల్ ఇవ్వడం విచిత్రంగా అనిపిస్తుంది. అందునా హత్యకోసం గొడ్డలి కొన్నది కూడా దస్తగిరి కావడం అయిన అతనికి బెయిల్ రావడం ఆశ్చర్యకరం ఆంటూ ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారనడానికి ఇది నిదర్శనం అంటూ బాలాజీ అభిప్రాయాపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…